/rtv/media/media_files/2025/08/29/viral-2025-08-29-15-41-14.jpg)
Viral
Viral: ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక చవితిని(Vinayaka Chavithi) ఘనంగా జరుపుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని ప్రత్యేకం చేసేది వినాయకుని విభిన్న రూపాల్లో దర్శించడమే. ప్రతి ఏడాదీ మండపాలు ఏర్పాటు చేసే వారు వినాయకుడిని విశేషమైన ఆకృతుల్లో ప్రతిష్ఠించేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. ఇటీవల ఈ సాంప్రదాయంలో ప్రతేకతకు ప్రాధాన్యం పెరిగింది. మన సినిమాల్లోని ప్రసిద్ధ పాత్రల ఆధారంగా వినాయక విగ్రహాలను తయారు చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌లా మారుతోంది. గతంలో ‘బాహుబలి వినాయకుడు’(Bahubali Ganesh Idol), ‘పుష్ప వినాయకుడు’ వంటి వినూత్న రూపాలలో దర్శనమిచ్చిన మహాగణపతి విగ్రహాలకు ప్రజల నుండి మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ విధంగా భక్తి, సినీ సాంస్కృతిక భావాలు కలగలిపి వినాయక ఉత్సవాలు వినాయక చవితి పండగకు కొత్త రంగులు అద్దుతున్నాయి.
Vinayaka Vigraham with Rudra reference by Ananthpur Rebels 👌👌🔥🔥💥💥 #Prabhas@kannappamoviepic.twitter.com/duHOeCPlOk
— Prabhas RULES (@PrabhasRules) August 29, 2025
మూవీ థీమ్ తో గణనాధులు..
అయితే ఇటీవల విడుదలైన కన్నప్ప మూవీలో ప్రభాస్ రుద్రుడిగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని వైఎస్సార్ కాలనీ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ కన్నప్ప మూవీలో ప్రభాస్ 'రుద్రుడి' పాత్ర ని పోలిన మహాగణపతి విగ్రహాన్ని(Kanappa Prabhas Ganesh Idol) ఏర్పాటు చేశారు. ఇలా మూవీ థీమ్ తో గణనాధులు వినాయకచవితికి సిద్ధం చేయడం అభిమానులకు భక్తితో పాటు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనే చెప్పాలి. అందుకు ఉదాహరణ గతంలో వినాయకచవితికి దర్శనమిచ్చిన ప్రభాస్ బాహుబలి విగ్రహాలు.. బాహుబలి సినిమా వచ్చిన కొత్తలో వినాయకచవితికి బాహుబలి రూపంలో తయారుచేసిన వినాయకుని విగ్రహాలు చాలానే కనిపించాయి. తాజాగా ఈ వినాయక చవితికి అనంతపురంలో ఏర్పాటు చేసిన 'రుద్రుడి' వినాయక విగ్రహం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.
Also Read:పచ్చని చీరలో అనికా.. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న బ్యూటీ!
దీనితో ప్రభాస్ అభిమానులు ఇప్పుడు 'రుద్రుడి' రూపంలో ఉన్న మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా భక్తుల మనసు దోచుకునే ఆకృతుల్లో బొజ్జగణపయ్యలు దర్శనమిస్తున్నారు. ప్రతీ చోటా గణేష్ ఉత్సవాల్లో సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ఏడాది ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలకు తగ్గట్లుగా విఘ్నేశ్వరుని ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు. అలాగే గతంలో కల్కి సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ను బేస్ చేసుకుని గణనాథుని విగ్రహాలను తయారు చేశారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీం క్యారక్టర్ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిందో తెలిసిందే. ఈ కొమరం భీం గణేష్ విగ్రహాలు కూడా గతంలో చాలా చోట్ల కనిపించాయి. వీటితో పాటు ట్రెండింగ్‌లో ఉన్న సినిమా హీరో గణేషులు, సెల్ఫీ గణేషులు.. ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా గణనాథులను ప్రతిష్ఠిస్తున్నారు. ప్రజలు కూడా విగ్రహం ధర, ఎత్తు ఇలాంటి వాటి గురించి ఆలోచించడం లేదని, కేవలం డిఫరెంట్‌గా మంచి ఆకృతిలో ఉన్న లంబోధరుడిని ఎంపిక చేసుకున్నట్లు మండపం నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read: 'పెద్ది' లో చరణ్‌కు తల్లిగా యంగ్ హీరోయిన్.. చివరికి ఊహించని ట్విస్ట్!