The Sabarmati Report: ఓటీటీలోకి మోదీ మెచ్చిన సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనం ఆధారంగా 'సబర్మతి రిపోర్ట్' అనే హిందీ మూవీ తెరకెక్కింది. ఇటీవల థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ప్రధాని మోదీ సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఈ చిత్రం జనవరి 10 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

New Update
sabarmati report ott

vikrant massey rashi khanna

బాలీవుడ్ లో విభిన్న తరహా కథా చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే.. గత ఏడాది   '12th ఫెయిల్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. గతేడాది జులై లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఐఏఎస్‌గా ఎదిగిన రియల్‌ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విక్రాంత్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఈ మూవీ సక్సెస్ తో ఇటీవల ఆయన మరో రియల్ ఇన్సిడెంట్ కథలో నటించారు. 'సబర్మతి రిపోర్ట్' పేరుతో తెరకెక్కిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనం ఘటనను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను ధీరజ్ సర్నా దర్శకత్వంలో రూపొందించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన పొందింది.

తాజాగా, ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. జనవరి 10 నుండి జీ5లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చి మద్దతు తెలిపారు. 

Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

ప్రధానమంత్రి మోదీతో పాటూహోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే ఈ సినిమా అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. రియల్ ఇన్సిడెంట్ తో తెరకెక్కడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాకి మరింత ఆదరణ దక్కే ఛాన్స్ ఉంది.

Advertisment
తాజా కథనాలు