Hero Ajith: మరోసారి అజిత్ కారుకు ప్రమాదం.. ట్రాక్ పక్కకు దూసుకెళ్లిన వాహనం

హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. అయితే అజిత్ బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డిస్పా-ఫ్రాంకోరాఛాంప్స్ రేస్ లో పాల్గొన్నారు. ఈ రేస్ లో కారు నియంత్రణ కోల్పోయి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు అజిత్ ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

New Update
hero ajith met with an accident

hero ajith met with an accident

Hero Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తరచూ రేసింగ్ లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. ఇటీవలే బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్ రేస్ లో అజిత్ పాల్గొన్నారు. అయితే ఈ రేసులో అజిత్ కారు నియంత్రణ కోల్పోయి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడడం అందరినీ ఊపిరిపీల్చుకునేలా చేసింది. 

Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!

Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

గతంలో కూడా.. 

ఇదిలా ఉంటే గతంలో కూడా అజిత్ కారు పలు మార్లు రేసింగ్ ట్రాక్ పై ప్రమాదానికి గురైంది. ఇది మూడోసారి. అంతకముందు దుబాయ్ లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం  ప్రాక్టీస్ చేస్తుండగా...అజిత్ కారు గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కూడా అదృష్టవశాత్తు అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత స్పెయిన్ లో జరిగిన మరో రేస్ లో పక్కనే వస్తున్న మరో కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన టీమ్ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఇందులో అజిత్ తప్పేమీలేదని.. ఇతర కారు వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. 

cinema-news | telugu-news | actor-ajith 

Dhana Sri Varma: క్రికెటర్ చాహల్ మాజీ భార్యతో తెలుగు డ్యాన్స్ మాస్టర్ రచ్చ రచ్చ.. నడుము పట్టుకుని ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు