Vijay Sethupathi: పూరీతో సినిమా ఒప్పుకోవడానికి కారణం అదే: విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి–పూరి జగన్నాథ్- టబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ జూన్‌లో ప్రారంభం కానుంది. కథ ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు  విజయ్ తెలిపారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది.

New Update
Puri Jagannadh- vijay sethupathi

Puri Jagannadh- vijay sethupathi

Vijay Sethupathi: తమిళ నటుడు విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) కాంబినేషన్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ కలయిక అందరిలో ఆశక్తిని రేకెత్తిస్తోంది, ముఖ్యంగా పూరి ఇటీవల కొన్ని ప్లాపులు ఎదుర్కొన్న నేపథ్యంలో. అయినప్పటికీ, విజయ్ సేతుపతి ఈ కాంబినేషన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ  ‘‘నాకు కథ నచ్చితే, దర్శకుడి గత సినిమాలు చూసి కాదు, కథ ఎలా చెప్పాడన్నదానిపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటాను. పూరి జగన్నాథ్ చెప్పిన కథాకథన శైలి నన్ను ఆకట్టుకుంది. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్. నేను ఇప్పటివరకు చేయని ఒక కొత్త జానర్ ఇది. నా పాత్ర కూడా ఎప్పుడూ చేయనిది. అదే నాకు సవాలుగా అనిపించింది’’ అన్నారు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

టబు కీలక పాత్రలో

ఇక ఈ చిత్రంలో టబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, ఆమెతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు విజయ్ తెలిపారు. ఆమె నటనకు తాను అభిమానినని చెప్పారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

ఈ భారీ ప్రాజెక్ట్‌కి జూన్‌లో గ్రాండ్ లాంచ్ జరగనుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొత్త యాంగిల్‌లో విజయ్ సేతుపతిని చూపించబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుంది. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను వెంటనే ఫాలో అవ్వండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు