Vijay Deverakonda: నటి రష్మికతో రిలేషన్‌పై విజయ్ దేవరకొండ సంచలన విషయాలు బయటపెట్టాడు. త్వరలో ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రౌడీ హీరో.. జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. పర్సనల్ అండ్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మేరకు ‘లైగర్’ సినిమాతో తనలో చాలా మార్పులు వచ్చాయని, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు.
కాబోయే భార్య లక్షణాలు
అలాగే పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని ప్రశ్నించగా ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదన్నాడు. కనీసం కాబోయే భాగస్వామి లక్షణాల గురించి చెప్పాలని అడగగా దాని గురించి ఇంకా ఏమీ అనుకోలేదని, కానీ తప్పకుండా ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక రష్మికలో మీ కాబోయే భార్య లక్షణాలున్నాయా అని ప్రశ్నించగా.. ‘రష్మికతో మరికొన్ని సినిమాలు చేయాలని ఉంది. ఆమె చాలా మంచి మనిషి. అందమైన నటి. ఆమె లాంటి మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా ఫర్వాలేదు' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రసుతం విజయ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకుంటున్నారు.
ఇక ‘కింగ్డమ్’ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా ఇది జులై 4న విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.
Vijay Deverakonda: ఏదో ఒక రోజు ఆమెను పెళ్లి చేసుకుంటా.. రష్మికతో రిలేషన్‌పై విజయ్ దేవరకొండ ఓపెన్!
నటి రష్మికతో రిలేషన్‌పై విజయ్ దేవరకొండ మనసులో మాట బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఆమెలాంటి లక్షణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాడు. 'ఆమె చాలా మంచి మనిషి. అందమైన నటి. మంచి మనసున్న అమ్మాయి. ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలనుంది' అంటూ పొగిడేశాడు.
Vijay Deverakonda interesting comments on with Rashmika relationship