అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా 'పుష్ప-3' కూడా ఉంటుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. Also Read : అల్లు అర్జున్ కపుల్‌ని చూసి ఏడ్చిన సమంత..! ఇన్స్టా పోస్ట్ వైరల్ "పార్ట్ 2" క్లైమాక్స్‌లో పుష్పరాజ్‌పై ఒక వ్యక్తి బాంబు దాడికి పాల్పడినట్లు చూపించారు. అయితే ఆ వ్యక్తి విజయ్ దేవరకొండ అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై శ్రీవల్లీ రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది." మీలాగే నాక్కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. చివరి వరకూ విషయాన్ని బయటపెట్టరు. "పుష్ప 2"కు సంబంధించిన విషయాలను కూడా షూట్ సమయంలోనే చెప్పేవారు. సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి.. "ఇతనెవరు?" అని నేనూ ఆశ్చర్యపోయా.." అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. Also Read : "వన్ నేషన్ వన్ ఎలక్షన్"లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!