Maha kumbh 2025: కుంభమేళాకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీలు.. ఫొటోలు వైరల్!

హీరో విజయ్ దేవరకొండ మహా కుంభమేళను సందర్శించుకున్న ఫొటోలను పంచుకున్నారు. విజయ్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా కుంభమేళాకు వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వెళ్ళలేదు. కేవలం అయన భార్య మాత్రమే వెళ్లారు.

New Update
vijay devarakonda kumbhamela

vijay devarakonda kumbhamela

Maha kumbh 2025: హీరో విజయ దేవరకొండ ప్రయాగ్ రాజ్ లో నెలకొన్న అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళాను ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే విజయ్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబం కూడా కుంభమేళా వెళ్లారు. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే కుంభమేళాకు అల్లు అర్జున్ వెళ్ళలేదు. కేవలం ఆయన భార్య మాత్రమే విజయ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.  ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభమేళా ఉత్సవం మరో తొమ్మిది రోజుల్లో ముగియనుంది. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. రైల్వే స్టేషన్స్, బస్ స్టాపుల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. 

Also Read: Tejaswi Madivada: తేజస్వి అందాల విధ్వంశం.. క్రీమ్ కలర్ డ్రెస్ లో హీటేక్కిస్తున్న బ్యూటీ

 'కింగ్ డమ్'

ఇక విజయ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  'కింగ్ డమ్' సినిమా చేస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా  భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.  ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, విజయ్ యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా కనిపించింది. 'ఆ అలజడి ఎవరికోసం' అంటూ తారక్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. టీజర్ తోనే 1000 కోట్లు పక్కా అంటున్నారు ఫ్యాన్స్.  ఈ సినిమాతో విజయ్ కమ్ బ్యాక్ గా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.  ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. 

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు