/rtv/media/media_files/2025/10/16/vijay-devarakonda-2025-10-16-17-37-27.jpg)
Vijay Devarakonda
Vijay Devarakonda: హిట్ సినిమాల దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్(Rahul Sankrityan) మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి పని చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా "టాక్సీవాలా" థియేటర్లలో విజయం సాధించింది, అప్పట్లో విడుదలకు ముందే పైరసీకి గురైనా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత రాహుల్, నాని నటించిన "శ్యామ్ సింగరాయ్" సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నారు.
Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!
ఇప్పుడు రాహుల్ - విజయ్ కాంబోలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. ఇటీవల జరిగిన "డూడ్" ప్రమోషన్ ఈవెంట్‌లో మాట్లాడిన రాహుల్, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తన విశ్వరూపంను చూపించనున్నారని, ఆయనలో ఉన్న అసలైన నటుడిని ప్రజలు చూస్తారని చెప్పారు.
Also Read: ‘బాహుబలి: ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..?
సోషల్ మీడియాలో వైరల్..
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "విజయ్ దేవరకొండలోని అసలు టాలెంట్ ఇప్పటి వరకు పూర్తిగా కనిపించలేదా?" అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దర్శకుడు చేసిన కామెంట్ వల్ల ఈ సినిమాలో ఏం ప్రత్యేకత ఉండబోతోందో తెలుసుకోవాలని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు.
Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థ టీ-సిరీస్ (Bhushan Kumar) దీనిని ప్రెజెంట్ చేయనున్నారు. దీనివల్ల ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. విజయ్ దేవరకొండ గత సినిమాల కన్నా ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపించనున్నారని దర్శకుడు హింట్ ఇచ్చారు. రాయలసీమ నేపథ్యంలో, భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.