BREAKING : కమెడియన్ ఆలీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ

కమెడియన్ ఆలీకి నోటీసులు అందాయి. తన ఫామ్ హౌజ్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రెటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలకు ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా.. ఈ నెల 22న మరో నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update
ali

టాలీవుడ్ సినీనటుడు, కమెడియన్ ఆలీకి నోటీసులు అందాయి. ఆయన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట(మం) ఎమ్మిడికాయ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ  ఫామ్ హౌజ్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రెటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలకు ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా.. ఆ నోటీసుకు అలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ నెల 22న మరో నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా అలీ తోపాటూ ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి సైతం ఈ నోటీసులు అందింనట్లు సమాచారం.

Also Read : వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ?

నోటీసు ప్రకారం మూడు రోజుల్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతీలో ఇవ్వాలని తెలిపారు. కాగా, ఈ నోటీసులపై తన తరఫు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు అలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇలా నోటీసులు పంపారని అలీ ఆరోపిస్తున్నారట. 

Also Read : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు