వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ?

ఏఆర్‌ రెహమాన్‌ లీగల్‌ టీమ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవమానకంగా, అసభ్యకరంగా, అసత్యాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటూ స్పష్టం చేసింది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తామని లీగల్‌ టీమ్‌ పేర్కొంది.

New Update
ar

ఆస్కార్ విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని.. అందువల్లనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తెలిపారు. 

దీనిపై ఏఆర్ రెహమాన్ కూడా స్పందిస్తూ పోస్టు పెట్టారు. తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో సినీ వర్గాలు షాక్ అయ్యాయి. కాగా రెహమాన్ విడాకులపై రకరకాల వార్తలు మీడియా వర్గాల్లో ప్రచురితం అవ్వగా.. దీనిపై ఏఆర్‌ రెహమాన్‌ లీగల్‌ టీమ్‌ నోటీసులు జారీ చేసింది. 

Also Read : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?

 అలా చేస్తే వారిపై పరువు నష్టం దావా..

ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవమానకంగా, అసభ్యకరంగా, అసత్యాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటూ లీగల్‌ టీమ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా నోటీసులను షేర్‌ చేసింది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై పరువు నష్టం దావా వేయాలని రెహమాన్‌ చెప్పినట్లుగా లీగల్‌ టీమ్‌ పేర్కొంది. 

అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచురించిన వారంతా 24 గంటల్లోగా తొలగించాలని.. లేకపోతే ఇండియన్‌ జస్టిస్‌ కోడ్‌-2023 ప్రకారం చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. ద్వేషాన్ని, అభ్యంతరకర కంటెంట్‌ షేర్‌ చేసిన వారంతా తొలగించాలని.. వారంతా రెహమాన్‌ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు కుటుంబానికి సైతం మనోవేధనను కలిగిస్తున్నారంటూ లీగల్‌ టీమ్‌ పేర్కొంది.

Advertisment