Allu Arjun: జైల్లో 14 గంటలు కూర్చునే ఉన్న బన్నీ.. ఇంకా ఏం చేశాడంటే.

సంధ్యా థియేటర్ కేసులో అరెస్ట్‌ అయిన సినీ నటుడు అల్లు అర్జున్‌ రాత్రంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.ఆయనకు మంజీర బ్యారక్ ను ఇచ్చారు. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి..సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు.

New Update
ALLU

Allu Arjun: పుష్ప 2 సినిమా విడుదల సమయంలో హైదరాబాద్‌ లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో అరెస్టు అయిన సినీ నటుడు అల్లు అర్జున్ రాత్రంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. ఖైదీలందరూ ఉండే బ్యారక్ వెళ్లిన తర్వాత ఆయనకు మంజీర బ్యారక్ ను ఇచ్చారు. అనంతరం ఆయన్ని అక్కడికి తీసుకుని వెళ్లారు.

Also Read: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా?

నేల మీద నిద్ర... 

జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని తినలేదు.రాత్రి 8 గంటల  సమయంలో మాత్రం టీ , స్నాక్స్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి..సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు.14 రోజులు రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనని ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన తరువాత రోజు మాత్రమే అందుతాయి. కాగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై క్లారిటీ ఇచ్చారు సెంట్రల్ జోన్ డీసీపీ. 

Also Read: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

భారీ ఈవెంట్లకు ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. భారీ కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. కానీ ఈ ఘటనలో ఇన్వార్డ్ సెక్షన్ లో ఒక లెటర్ ఇచ్చి సంధ్య థియేటర్ యాజమాన్యం వెళ్లిపోయారని చెప్పారు.

Also Read: CM Chandra babu: అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్

హీరో వస్తున్నారన్న విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా..మేము ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటన జరిగి 9రోజులు అవుతున్నప్పటికీ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అరెస్టు చేసిన విధానం పైన కూడా క్లారిటీ ఇచ్చారు. పోలీసులు ఎక్కడా అల్లు అర్జున్ తో దురుసుగా ప్రవర్తించాలేదని డీసీపీ తెలిపారు.

Also Read: Karnataka: కన్నడ నటులు దర్శన్, పవిత్ర గౌడ్‌లకు బెయిల్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు