'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి సూపర్ సాంగ్.. 18ఏళ్ల తర్వాత రమణ గోగుల గాత్రం

పాపులర్ సింగర్ రమణ గోగుల చాలా ఏళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో ఫస్ట్ సింగిల్ 'గోదారిగట్టు' మెలోడీతో తన మధురమైన స్వరాన్ని వినిపించబోతున్నారు. ఈ సాంగ్ ప్రోమో రేపు విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.

New Update

Ramana Gogula :  బంగాళాకాతంలో నేనంటే, ఏయ్ చికీతా, దగా దగా మెరిసే, ఒరోరొ యోగి, లుక్ యట్ యువర్ ఫేస్ ఇన్ ది మిర్రర్, వయ్యారి భామా.. ఈ పాటలు వినగానే సింగర్ రమణ గోగుల పేరు గుర్తుకురావాల్సిందే. ఆ పాటల్లోని వాయిస్, ఆ వాయిస్ కి ఉన్న బేస్ అలాంటిది. 25 కు పైగా సినిమాల్లో మాస్, క్లాస్, రొమాంటిక్ పాటలతో టాలీవుడ్ పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన పెక్యులియర్ వాయిస్ కి సెపెరేట్ ఫ్యాన్సే ఉన్నారు.  తమ్ముడు, బద్రి, లక్ష్మీ, యోగి, అన్నవరం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి అనేక సినిమాలకు మ్యూజికల్ హిట్స్ అందించారు. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

18 ఏళ్ళ తర్వాత మళ్ళీ.. 

అయితే  దాదాపు 18 ఏళ్ళ తర్వాత రమణ గోగుల తన గాత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'సంక్రాంతికి  వస్తున్నాం'  సినిమాలో ఫస్ట్ సింగిల్ 'గోదారిగట్టు' మెలోడీతో తన పాటను వినిపించబోతున్నారు. సింగర్ గీతా మాధురి, రమణ గోగుల ఇద్దరు కలిసి ఈ పాట పాడుతున్నారు. ఈ సాంగ్ ప్రోమో రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు.  ''హృదయాలను తాకే స్వరాలు'' అంటూ #గోదారిగట్టు సాంగ్ ప్రోమో రేపు రానుంది. ఫుల్ లిరికల్ వీడియో డిసెంబర్ 3న వస్తుంది అంటూ పోస్ట్ పెట్టారు. 

Also Read: నన్ను అరెస్టు చేయాలని చూస్తే.. RGV షాకింగ్ ట్వీట్

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు