విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది.
Also Read : పదేళ్లు ఏం వెలగబెట్టారని మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు.. బీఆర్‌ఎస్‌కు రేవంత్ చురకలు
జనవరి 14 న..
ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రికేక్ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ నేడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జనవరి 14 సంక్రాంతి రోజున రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు.
Also read: మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో వెంకీమామ పంచె కట్టులో చేతిలో గన్ పట్టుకొని ఉన్న లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. గత ఏడాది సంక్రాంతికి 'సైంధవ్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ సంక్రాంతికైనా వెంకీమామ ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి.
Also Read : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్
త్వరలోనే ఫస్ట్ సింగిల్..
ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించి చిన్న వీడియో క్లిప్ వదిలారు. అందులో ఈ సాంగ్ ను ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ రమణ గోగుల పడినట్లు చూపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సుమారు 18 ఏళ్ళ తర్వాత రమణ గోగుల.. వెంకటేష్ సినిమాకు పాట పడుతుండటం విశేషం.
Also Read: రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో!