Raashi Khanna: ఇది నిజమేనండీ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి శ్లోకా ఫస్ట్ లుక్!

పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా కూడా మరో ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

New Update
ustaad bhagat singh

ustaad bhagat singh

పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా కూడా మరో ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 'ఉస్తాద్ భగత్ సింగ్' లో రాశీ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రాశీ 'శ్లోక' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. పోస్టర్ లో రాశీ మెడలో కెమెరా వేసుకొని స్టైలిష్ గా కనిపించింది. చూస్తుంటే.. సినిమాలో రాశీ ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్  అన్నట్లుగా అనిపిస్తోంది. 

Also Read: Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!

Ustaad Bhagat Singh Team Welcomes Raashii Khanna

Also Read :  అంతా ఫేక్.. సోనూ సూద్ నుంచి ఒక్క రూపాయి రాలేదు - ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ డీఎస్పీ  సంగీతం  అందిస్తున్నారు.  పవన్ ఫ్యాన్స్  ని అలరించే మాస్ అంశాలు, ఎలివేషన్స్, విజిల్ మార్క్ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. అంతేగాదు కథ, కథనం పాత్రలు అన్నీ కొత్తగా ఉంటాయని, పవన్ ని ఇప్పటివరకు చూడని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూడబోతున్నారని   డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు. 

Also Read: Pawan Kalyan: పార్టీ కోసమే రీమేకులు.. అసలు విషయం చెప్పిన పవన్!

Also Read :  పవన్ కల్యాణ్ గాలినాకొడుకు..  రోజా సంచలన కామెంట్స్!

ustad-bhagat-singh | raashi-khanna

Advertisment
తాజా కథనాలు