కన్నడ హీరో ఉపేంద్రకు తెలుగులోనూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతడు కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆయన తీసే సినిమాలు సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్లుగానే ఉంటాయి. ఇక గత పదేళ్లుగా నటనకు, దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చిన ఆయన.. తాజాగా మెగా ఫోన్ పట్టాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘యూఐ’. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. ఉపేంద్ర ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడు అనేది పూర్తిగా తెలుసుకుందాం.
కథ
ఈ సినిమా స్టోరీ అర్థం కావాలంటే మెదడుకి బాగా పదును పెట్టాలి. ఇది ఒక సినిమా అయినప్పటికీ ఉపేంద్ర ఈ సినిమాలో అచ్చం ఇలాంటి కథతోనే ‘యూఐ’ పేరుతో సినిమా తీస్తాడు. ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూఐ’ మూవీ థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు మెంటల్ ఎక్కుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఓ వైపు సినిమా అర్థం అయినవాళ్లు వింతగా ప్రవర్తిస్తుంటారు. మరోవైపు ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ సినిమా చూస్తుంటారు. అసలు ఈ స్టోరీ సంగతేంటని ఓ రివ్యూ రైటర్ ఏకంగా దర్శకుడు ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడొక విషయం తెలుసుకుంటాడు. రాసిన కథ వేరు.. చూపించిన కథ వేరు అని తెలుసుకుంటాడు. మరి ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర) ఎవరు? కల్కి (ఉపేంద్ర) ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సింది.
ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఎలా ఉందంటే?
సాధారణంగా సినిమా అంటే హీరో, హీరోయిన్, విలన్, ఫైట్స్, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం అవేమి కనిపించవు. అయితే ఈ సినిమాలో ఉన్నంతసేపు అబ్బురపరచే విజువల్స్ ఉంటాయి. డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్‌లో కనిపిస్తుంటాడు. కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి.
ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
కాగా సినిమా మొదలైనప్పుడే వింత టైటిల్ పడుతుంది. ‘మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి, మూర్ఖులైతే సినిమా మొత్తం చూడండి’ అంటూ తెరపై చూపించి తన మార్క్ మొదలుపెట్టాడు ఉపేంద్ర. ముఖ్యంగా ఈ సినిమాలో ఆధునిక సమాజం, రాజకీయ వ్యవస్థపై తనదైన శైలిలో వ్యంగ్రాస్తాలు సంధించాడు ఉపేంద్ర. ఈ సినిమా కథ ఏంటంటే.. భూమ్మీద తొలి జంట నుంచి మొదలు పెట్టి కల్కి అవతరించడం వరకూ సాగే సుధీర్ఘమైనది.
ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు
ప్రపంచంలోని అన్ని మతాల్ని, సంస్కృతుల్ని ఒక దగ్గరకి తీసుకొచ్చి చూపించాడు. అయితే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అర్థం కావడం చాలా సులువే అయినప్పటికీ మరికొన్ని మాత్రం అసలు అంతుచిక్కవు, అర్థం కావు. మొత్తంగా ఈ సినిమాతో ఉపేంద్ర తన దర్శకత్వంలో మరో మార్క్ చూపించాడు.
ఎవరెలా చేశారంటే?
ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
ఇందులో ఉపేంద్ర యాక్టింగ్ దుమ్ము దులిపేసాడనే చెప్పాలి. రెండు పాత్రలలో కనిపించి అబ్బురపరిచాడు. సత్య, కల్కి పాత్రలతో సినిమా మొత్తం కనిపించాడు. అలాగే రవిశంకర్ వివిధ గెటప్‌లలో కనిపించి అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ రీష్మా పాత్ర మామూలుగానే ఉంది. మురళీ శర్మ ఇందులో సినీ విమర్శకుడిగా కనిపిస్తాడు. అలాగే నిధి సుబ్బయ్య, సన్నీలియోని, ఇంద్రజిత్ సహా మరికొంతమంది పాత్రలు ఆకట్టుకున్నాయి. వేణుగోపాల్ కెమెరా వర్క్ బాగుంది. నిర్మల్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం. మొత్తంగా ఉపేంద్ర యాక్టింగ్ ఎంత క్రేజీగా ఉందో.. ఆయన దర్శకత్వం సైతం అలానే ఉంది.
ఈ సినిమాకి 2.75/5 రేటింగ్ ఇవ్వొచ్చు.