Ari: My Name is Nobody Movie: అదిరిపోయిన అరి మూవీ.. ప్రశంసలు కురిపించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!

పేపర్ బాయ్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన జయశంకర్ ఏడేళ్ల తర్వాత అరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాగా.. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శకుడు జయశంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

New Update
Ari: My Name is Nobody

Ari: My Name is Nobody

పేపర్ బాయ్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన జయశంకర్ ఏడేళ్ల తర్వాత అరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాగా.. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. అరి మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా  దర్శకుడు జయశంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మీ ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని.. 'అరి' విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు స్క్రీన్ ప్లే, సాంగ్స్ కూడా బాగున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. మూవీకి ఈ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే విజువల్స్ పరంగా కూడా అరి మూవీకి ప్రశంసలు వస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Priyanka Mohan: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..

ఇది కూడా చూడండి: Mehreen Pirzada: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్.. అందం చూసి వావ్ అంటున్న నెటిజన్లు!

అదిరిపోయిన అరి మూవీ..

ఫైనల్‌గా దర్శకత్వం అయితే బాగుందని చెప్పవచ్చు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు దర్శకుడు జయశంకర్ ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి, సన్నివేశాలను నడిపించిన తీరును చూసిన ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. దీనితో దర్శకుడిగా జయశంకర్ తన రెండో సినిమా సక్సెస్‌ను విజయవంతంగా దాటారని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వారి పాత్రల మేరకు నటించారు. అయితే ఈ మూవీ కేవలం సినిమాటిక్ విజయాన్నే కాక, సందేశాత్మక విజయాన్ని కూడా సాధించి, తన ఏడేళ్ల ప్రయాణానికి సార్థకతను ఇచ్చిందని దర్శకుడు తెలిపారు. అయితే మీరు ఈ మూవీ ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. 

Advertisment
తాజా కథనాలు