Priyanka Mohan: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..

OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ పై ఇటీవల కొన్ని ఫేక్ AI ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిని ఖండించిన ఆమె, టెక్నాలజీని తప్పుగా వాడొద్దని, నిజమైన సమాచారం మాత్రమే పంచుకోవాలని కోరారు. ఆమె స్పందనకు అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.

New Update
Priyanka Mohan

Priyanka Mohan

Priyanka Mohan: టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తోంది. కానీ అదే టెక్నాలజీని తప్పుగా వాడితే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో తాజాగా OG సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ పరిస్థితే ఉదాహరణ.

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI టూల్స్ వినియోగం పెరుగుతుండగా, కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల హీరోయిన్లు ముఖ్యంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ప్రియాంక మోహన్‌కి సంబంధించి కొన్ని నకిలీ AI ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటిని చూసిన అభిమానులు షాక్‌కు గురయ్యారు.

Also Read: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?

OG సినిమాలోని గెటప్‌లోనే! (Priyanka Mohan AI Photos)

ఈ నకిలీ ఫోటోలు, ఆమె OG సినిమా 'సువ్వి సువ్వి' పాటలో ఉన్న లుక్‌కు దగ్గరగా ఉండటంతో, వాటిని నిజమని చాలా మంది నమ్మేశారు. అయితే తక్షణమే ప్రియాంక స్పందిస్తూ, అవి తన ఫోటోలు కావని, అవన్నీ కృత్రిమంగా (AI ద్వారా) తయారు చేసిన ఫేక్ పిక్చర్లు అని స్పష్టం చేశారు.

Also Read: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!

Also Read: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్.. 

సోషల్ మీడియా ద్వారా స్పందించిన ప్రియాంక మోహన్ తన X (Twitter) ఖాతాలో ఇలా రాశారు.. 

"కొన్ని AI ద్వారా చేసిన నకిలీ చిత్రాలు నన్ను తప్పుగా చూపిస్తున్నాయి. దయచేసి అలాంటి ఫోటోలు షేర్ చేయకండి. AI ను నిజాయితీగా వాడాలి తప్ప అబద్ధాలకు వేదికగా మారకూడదు. మనం ఏం సృష్టిస్తున్నాం, ఏం పంచుకుంటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు." ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రియాంక స్పందనపై అభిమానులు, నెటిజన్లు సపోర్ట్ తెలిపారు.

Also Read: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..

సాయి పల్లవికి కూడా ఇదే పరిస్థితి

ఇటీవలే మరో టాలెంటెడ్ నటి సాయి పల్లవి కూడా ఇటువంటి దుర్వినియోగానికి చిక్కారు. ఆమెకు సంబంధించి కూడా కొన్ని నకిలీ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఆమె వాటిని ఖండించారు. ఇప్పుడు అదే పరిస్థితి ప్రియాంకకు ఎదురైంది.

ప్రస్తుతం OG సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కన్మని పాత్రలో నటించిన ప్రియాంకకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. నటనతో పాటు స్క్రీన్‌ ప్రెజెన్స్ కూడా మెప్పించింది. త్వరలోనే ఆమె తమిళ నటుడు కవిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కనిపించనున్నారు.

Advertisment
తాజా కథనాలు