/rtv/media/media_files/2025/07/01/hero-ram-2025-07-01-12-51-05.jpg)
hero ram
Hero Ram: హీరో రామ్ పోతినేని ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న "ఆంధ్ర కింగ్" షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఆయన స్టే చేసిన హోటల్ లో కలకలం రేగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రామ్ వీఏపీ సూట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Also Read: Shefali Jariwala: షెఫాలీ ఆకస్మిక మరణంలో జోస్యం నిజమైందా? వైరలవుతున్న పాత వీడియో!
రామ్ నిద్రిస్తుండగా
చిత్ర యూనిట్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం.. సోమవారం 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు హోటల్ రెసెప్షన్ దగ్గరికి వెళ్లి.. తాము రామ్ టీమ్ లోని సభ్యులమని చెప్పారట. ఆ తర్వాత ఆరో అంతస్తులోని రామ్ వీఐపీ రూమ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ యాక్సెస్ కావాలని కోరారు. అయితే హోటల్ సిబ్బంది వీరిద్దరినీ ఎలా అనుమతించారో స్పష్టంగా తెలియదు కానీ.. వారికి యాక్సెస్ ఇచ్చారు. మొత్తానికి రామ్ ఉంటున్న ఆరో అంతస్థుకి చేరుకున్నారు.
Also Read: Phone-tapping : పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?
అనంతరం అక్కడ హౌస్ కీపింగ్ ని ఏవో మాయమాటలతో నమ్మించి మాస్టర్ రూమ్ కీ సంపాదించారట. ఆ కీతో రామ్ ఉంటున్న రూమ్‌లోకి ప్రవేశించారు. అయితే, రామ్ ఉన్నది వీఐపీ సూట్ కావడంతో, లోపల మరో బెడ్‌రూమ్ లో ఆయన తలుపు వేసుకొని నిద్రపోతున్నారు.
#RamPothineni faces security scare at Sheraton Hotel, Rajahmundry, during #AndhraKingThaluka shoot. Two intoxicated men allegedly entered his VIP suite using a master key. Police intervened, and hotel filed a complaint. #Ram #AndhraKingTaluka #SecurityBreach pic.twitter.com/TVglpORhQq
— The Cult Cinema (@cultcinemafeed) July 1, 2025
గట్టిగా తలుపులు బాది!
గది తలుపులు గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించడంతో రామ్ నిద్రలేచారు. దీంతో రామ్ వెంటనే తన టీమ్‌ను సంప్రదించారు. విషయం తెలియగానే చిత్ర యూనిట్, హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆ ఇద్దరు వ్యక్తులు ఫుల్ గా మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది.