/rtv/media/media_files/2025/02/01/YZcmVuMmjxQoS7YVyJKM.jpg)
Udit Narayan
Udit Narayan: 'అందమైన ప్రేమరాణి', 'అందాల ఆడబొమ్మ', 'కీరవాణి రాగంలో', 'పసిఫిక్‌లో దూకేయ్‌మంటే', 'అమ్మాయే సన్నగా' సాంగ్స్ ఫేమ్ సింగర్ ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే జరిగిన ఓ లైవ్ కాన్సర్ట్ లో తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన లేడీ ఫ్యాన్స్ ని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదేం పాడు పని అంటూ పలువురు ఆయన తీరును తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సింగర్ ఉదిత్ ఈ వివాదంపై స్పందించారు. ఓ ఆంగ్ల వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Also Read: Thandel Movie: తండేల్ లో ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారట.. ఏంటో తెలిస్తే షాకే !
🚨Video of #UditNarayan Lip Kissing a Fan has gone viral.
— Let's Talk TV|Latest Updates (@letstalktv___) February 1, 2025
The Internet is criticizing and calling it Disgusting. pic.twitter.com/5dIthwMnM3
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
ముద్దు వివాదంపై ఉదిత్ కామెంట్స్..
అభిమానులకు నేనంటే ఎంతో ఇష్టం. తమ ఇష్టాన్ని తెలియజేయడానికి ఫ్యాన్స్ ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా కొంతమంది హ్యాండ్ షేక్ ఇవ్వాలని అనుకుంటారు, మరికొంతమంది అభిమానంతో ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. అది కేవలం ఆత్మీయతతో కూడుకున్న విషయం మాత్రమే. వారితో తప్పుగా ప్రవర్తించాలనే ఉద్దేశం నాకు లేదు. నేను ఎంతో గౌరవం కలిగిన వ్యక్తిని.. సమాజంలో మంచి పేరు ఉంది. కొంతమంది కావాలనే దీనిని వివాదంగా చూస్తున్నారు అని తెలిపారు.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
Laila Third Single: 'కోయ్ కోయ్... కోడిని కొయ్' అంటున్న విశ్వక్ సేన్.. ఇరగదీస్తున్న 'లైలా' మాస్ సాంగ్..