Tuk Tuk Movie: యంగ్ టాలెంట్ హర్ష రోషన్, కార్తికేయ, స్టీవెన్, సాన్వీ మేఘన, నిహాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ కామెడీ ఎంటర్ టైనర్ 'టుక్ టుక్'. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 100 మిలియన్ పైగా వీక్షణాలతో నెంబర్ 3 ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక చిన్న సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమాలో పెద్ద స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్ లేకపోయినా.. మంచి కథకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుందని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. షార్ట్ ఫిల్మ్ తీయాలనే కోరికతో ఉన్న ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
సుప్రీత్ సి దర్శకత్వం
డ్రామా, హ్యూమర్, ఎమోషన్ అన్నింటినీ సమపాళ్లలో చూపిస్తూ సినిమాను చక్కగా ప్రజెంట్ చేశారు దర్శకుడు. అలాగే నటీనటుల ప్రదర్శన, స్క్రీన్‌ప్లే, అద్భుతమైన సంగీతం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మూవీలోని ప్రతీ క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కొంతమంది నటులు తమ డైలాగ్ డెలివరీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు కూడా. ఈ చిత్రానికి సుప్రీత్ సి దర్శకత్వం వహించారు.
Embrace the soulful melody with AI-powered visuals ❤️✨️
— Saanve Megghana (@SaanveMegghana) March 8, 2025
The futuristic beats of #RuRu will take you to a new world🔥
Presenting AI Music Video from #TukTuk
-- https://t.co/YVeE1ZBG6N#TukTukOnMarch21@NihalKodhaty1 @SaanveMegghana #SupreethCKrishna #RahulReddy pic.twitter.com/i0AqDE1G0C
ఫస్ట్ AI మ్యూజిక్ వీడియో
అయితే భారతీయ సినిమా చరిత్రలో మొదటిసారి ఈ చిత్రంలో AI జనరేటెడ్ పాటను రూపొందించారు. నటీనటులపై AI విజువల్స్ అప్లై చేసి పాటను అందంగా చిత్రీకరించారు. రు.. రు.. అనే లిరిక్స్ తో సాగిన ఈ పాట పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ తో పాటు మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాటకు డైరెక్టర్ సుప్రీత్ సి కృష్ణ సాహిత్యం అందించగా పవిత్ర నార్కినబిల్లి, సంతు ఓంకార్ పాడారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!