Chiranjeevi Comments: వెళ్లిన పనేంటి? మాట్లాడిన మాటలేంటి? చిరంజీవి కామెంట్స్ పై నెట్టింట దుమారం!

బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఈవెంట్లో చిరు సినిమా ప్రమోషన్ కన్నా తన సొంత విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని.. ఇక్కడ అవి అవసరమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

New Update
chiranjeevi comments

chiranjeevi comments

Chiranjeevi Comments: హాస్యబ్రహ్మా  బ్రహ్మానందం(Bramhanandham), గౌతమ్(Gautham) లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బ్రహ్మా ఆనందం'. నిజజీవితంలో తండ్రీకొడుకులు అయిన వీరిద్దరూ ఈ చిత్రంలో తాతమనవాళ్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  

Also Read: Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!

తన ఇళ్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని, ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉంటుందని చిరంజీవి తెలిపారు.  రామ్ చరణ్ కు కొడుకు పుట్టి తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక ఉన్నట్లుగా తెలిపారు. 'చరణ్ ఈసారి ఓ అబ్బాయిని కనురా అని అడుగుతుంటా. మళ్లీ అమ్మాయిని కంటాడేమోననే భయం కూడా ఉంటుంది' అని అన్నారు చిరంజీవి. అయితే  వారసత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కు మరో కూతురు జన్మిస్తుందేమోనని భయం వ్యక్తం చేయడాన్ని తప్పుబడుతున్నారు. మెగాస్టార్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం ఏంటని విమర్శిస్తున్నారు. 2025లోనూ పురుషాధిక్యమే కోరుకుంటున్నారని అని మండిపడుతున్నారు. అయితే వారసుడిని చిరు కోరుకోవడంలో తప్పేంటని మరికొందరు ఆయన్ను సమర్థిస్తున్నారు కూడా.  

 

ఇక రాజకీయాల్లోకి వెళ్లాక తాను చాలా ఒత్తిడికి గురయ్యానని అన్నారు చిరంజీవి. తనను తిట్టిన వాళ్లని, తిట్టని వాళ్లనూ కూడా తిట్టాల్సివచ్చేదని తెలిపారు. తిట్లు రాసుకునేవాడిని. మీరు దేనికీ పెద్దగా నవ్వడం లేదని తన భార్య అడిగితే హాస్య గ్రంథులు దొబ్బేసాయేమోనని చెప్పానన్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత తిరిగి నవ్వడం మొదలుపెట్టానని తెలిపారు. ఎవరిదో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు తన సొంత విషయాలను ఇక్కడ చెప్పుకోవడానికి అవసరమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.  

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

రాజకీయాలకు దూరంగా ఉంటా

ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి ప్రకటించారు. ఇకపై కళామతల్లి సేవలోనే గడిపేస్తానని, రాజకీయ పెద్దలను కలిసేది సినీ రంగానికి అవసరమైన సహకారం కోసమే స్పష్టం చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని చిరంజీవి వెల్లడించారు.  తన తాతగారి గురించి చిరంజీవి సరదా వ్యాఖ్యలు చేశారు. తన తాత పేరు రాధాకృష్ణనాయుడు అని..  తనకు ఆయన పోలికలు మాత్రం రావొద్దని ఇంట్లో అంటుండేవారని చిరు తెలిపారు. ఎందుకంటే ఆయన పెద్ద రసికుడని తెలిపారు.  ఇంట్లోనే ఇద్దరు అమ్మమ్మలుండేవారుని..  వారి మీద అలిగినప్పుడు ఆయన మరో ఆమె వద్దకు వెళ్లేవారన్నారు.   కానీ ఆయన చాలా దానధర్మాలు చేసేవారు. అదొక్కటే నేను అందిపుచ్చుకున్నానని చిరు తెలిపారు.  

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొరపాటున మెగాస్టార్ నోరు జారారు.  బ్రహ్మానందం మీమ్స్ గురించి సరదాగా మాట్లాడుతూ..  ''మీమ్స్ లో ఎర్రి.. అదే ఎరుపు మొహం పెడతారు కదా..'' అని అన్నారు. దీంతో చిరు వెనకాల ఉన్న బ్రహ్మానందం, నాగ్‍అశ్విన్, రాజా గౌతమ్ ఆశ్చర్యపోయారు. బ్రహ్మానందం అయితే అవాక్కై నోటిఫై చేయి వేసుకున్నారు. మొత్తానికి చిరు తన సొంతవిషయాలు చెప్పుకోవడానికే ఈ వేదికను ఎంచుకున్నారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

  

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు