/rtv/media/media_files/2025/06/24/trisha-post-on-vijay-birthday-gone-viral-2025-06-24-16-15-10.jpg)
trisha post on vijay birthday gone viral
Trisha: కోలీవుడ్ స్టార్ విజయ్ తలపతి పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. "హ్యాపీ బర్త్ డే బెస్ట్ఎస్ట్" అని క్యాప్షన్ పెట్టి, దానికి హగ్, ఎవిల్ ఐ ఎమోజీలను కూడా జోడించింది. ఈ ఫొటోలో విజయ్ త్రిష పెంపుడు కుక్క'ఇజ్జీ'తో ఆడుకుంటుండగా.. పక్కనే కూర్చున్న త్రిష విజయ్ వైపు చూస్తూ ఉంది.
డేటింగ్ రూమర్ల వేళ
అయితే గత కొద్దిరోజులుగా త్రిష.. విజయ్ తో ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో త్రిష పోస్ట్ వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇది చూసిన నెటిజన్లు వీరి బంధం గురించి రకరకాల ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. కొందరు అభిమానులు ఈ ఫోటోను చూసి "మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా?" అని నేరుగా అడిగేశారు. మరికొందరు అది కేవలం స్నేహమేనని కొట్టిపారేశారు. విజయ్ చాలా మంది నటీనటులతో స్నేహంగా ఉంటారని సమర్థించారు.
మరోవైపు త్రిష తల్లి ఉమా కృష్ణన్ కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటోను పంచుకుంటూ హార్ట్ ఎమోజీలు పెట్టడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ పుకార్ల గురించి విజయ్ , త్రిష మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. విజయ్ భార్య సంగీత చాలా కాలంగా పబ్లిక్ ఈవెంట్లలో కనిపించకపోవడం కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోసిందని టాక్. ఏదేమైనా త్రిష పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
విజయ్- త్రిష అనేక చిత్రాల్లో కలిసి నటించారు. 'ఘిల్లి', 'తిరుపాచ్చి', 'లియో' వంటి సినిమాల్లో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై వారిద్దరూ మంచి జోడిగా ఉండటంతో, నిజ జీవితంలో కూడా వారికి ఏదో సంబంధం ఉందనే ఊహాగానాలు ఎప్పటినుంచో మొదలయ్యాయి. ఇప్పుడు ఈ తాజా పోస్ట్‌తో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)