సెకెండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోన్న త్రిష..చేతిలో ఏకంగా ఏడు సినిమాలు

గత ఏడాది 'లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకున్న త్రిష.. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి 'విశ్వంభర' మూవీతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో పాటూ తమిళ్, మలయాళ భాషల్లో కలుపుకొని త్రిష చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి.

New Update
trisha

చెన్నై బ్యూటీ త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. ప్రస్తుతం సౌత్ లో వరుస ఆఫర్స్ తో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. గత ఏడాది 'లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకున్న త్రిష.. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి 'విశ్వంభర' మూవీతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. 

Also Read : రెమ్యునరేషన్ లోనూ తగ్గేదేలే..'పుష్ప2' కి బన్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా?

బిజీ హీరోయిన్ గా త్రిష..

ఈ సినిమాతో పాటూ ప్రెజెంట్ త్రిష చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. ఇటీవలే ‘విశ్వంభర’ మూవీ పూర్తి చేసిన ఈమె.. అజిత్ హీరోగా వస్తోన్న ‘విదాముయార్చి’ సంక్రాంతి విడుదలకు సిద్ధమైంది. అలాగే మరో అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.

కమల్ హాసన్‌తో  ‘థగ్ లైఫ్’, మలయాళంలో మోహన్ లాల్‌తో ‘రామ్’, అలాగే సూర్య 45లోనూ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.  తనతో కలిసి కెరీర్ మొదలుపెట్టిన చాలా మంది హీరోయిన్‌లు సైడ్ క్యారెక్టర్లకు పరిమితం కాగా, త్రిష మాత్రం స్టార్ హీరోలతో ప్రాజెక్టులలో లీడ్ రోల్ చేస్తూ స్పీడ్‌ తో దూసుకుపోతోంది. ఈ ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, త్రిష క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Also Read : ధనుష్ తో వివాదం.. దెబ్బకు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు