Trance of OMI: ‘OG’ నుంచి పవర్‌ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌.. 'ట్రాన్స్ ఆఫ్ OMI' విన్నారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఓజీ” నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ OMI’ అనే పాటను విడుదల చేశారు. జపాన్ లిరిక్స్‌తో థమన్ ఇచ్చిన సంగీతం అభిమానులను ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించి ప్రతి అప్డేట్‌కి భారీ స్పందన వస్తోంది.

New Update

Trance of OMI: ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత హైప్ ఉన్న చిత్రాల్లో “ఓజీ” (OG) ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. OGకి ఉన్న క్రేజ్ అలాంటిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్‌కి అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. తాజాగా చిత్రంలోని  'ట్రాన్స్ ఆఫ్ OMI'  అనే పాటను రిలీజ్(OG New Song Release) చేసారు మూవీ టీమ్. జపాన్ లిరిక్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. 

Also Read: ఓటీటీలోకి 'కూలీ' ఎంట్రీ.. తలైవా వైబ్ అస్సలు మిస్సవకండి!

ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా, ఇటీవల అతనిపై రూపొందించిన మ్యూజికల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినగానే చాలామంది ఊహించని రీతిలో షాక్ అయ్యారు. పవన్ కెరీర్‌లో ఇదొక యూనిక్ లెవెల్ మ్యూజిక్ అనిపిస్తోంది.

Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్‌ ఫ్యాన్స్‌ కి పండగే..!

అయితే ఈ గ్లింప్స్ ట్రాక్ మొత్తం 3 నిమిషాల నిడివితో ఉంది. ఇందులోని బీట్స్, ట్రాన్స్ వర్షన్ ప్రేక్షకులను డిఫరెంట్ మూడ్‌లోకి తీసుకెళ్లేలా ఉంది. ఈ ట్రాక్‌ను "Trans of Omi" అనే పేరుతో ఈరోజు (సెప్టెంబర్ 11) సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేశారు.

దీంతో ‘ఓజీ’పై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు చేరాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, ఇమ్రాన్ హష్మీ విలనిజం, థమన్ మ్యూజిక్ ఈ ముగ్గురు కలిస్తే స్క్రీన్‌పై ఎలాంటి మాస్ మ్యాజిక్ జరుగుతోందో మూవీ రిలీజ్ తర్వాత చూడాలి.

Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్‌ ఫ్యాన్స్‌ కి పండగే..!

సెప్టెంబర్ 25న థియేటర్లలో ‘ఓజీ’ 

ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవ్వగా, ట్రైలర్ విడుదల కూడా త్వరలోనే జరగనుంది.

Also Read:'రాజా సాబ్'పై SKN సాలిడ్ అప్‌డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!

గతంలో హరిహర వీరమల్లు సినిమాతో కొంత నిరాశకు గురిచేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ‘ఓజీ’తో మళ్లీ మాస్ మార్కెట్‌లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కథ, కాస్టింగ్, మ్యూజిక్ అన్ని అంశాలు చూస్తే, ఇది పవన్ కెరీర్‌లో మరో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్ OG కోసం అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు