Tourist Family: శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రాజమౌళి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు. డెబ్యూ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, బక్స్, ఎలాంగో కుమారవేల్, శ్రీజా రవి కీలక పాత్రలు పోషించారు.
Blockbuster of the year 🔥 #TouristFamily streaming from June 2nd on @SimplySouthApp 🍿!!@SasikumarDir @SimranbaggaOffc@MillionOffl @Abishanjeevinth#OTT_Trackers pic.twitter.com/Wo73YzI6lg
— OTT Trackers (@OTT_Trackers) May 27, 2025
మూవీ స్టోరీ
శ్రీలంకలో ఆర్థిక పతనం, COVID సంక్షోభం తర్వాత తమిళనాడుకు అక్రమంగా వలస వెళ్ళిన ధర్మదాస్ (శశికుమార్), అతని భార్య (సిమ్రాన్), వారి ఇద్దరు కుమారుల నేపథ్యంలో సాగే కుటుంబం కథ ఇది. వారు కొత్త జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నించే క్రమంలో ఆ కుటుంబం ఎదుర్కున్న సవాళ్లు ఈ చిత్రంలో చూపించారు.
latest-news | cinema-news | telugu-cinema-news
Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!