Bihar : నువ్వో పిల్ల బచ్చగాడివి, నీకేం తెలుసు ..అసెంబ్లీలో ఊగిపోయిన సీఎం నితీష్!

బీహార్ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  బీహార్‌ ఓటర్ల జాబితాలో స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) కు వ్యతిరేకంగా తేజస్వియాదవ్‌ మాట్లాడగా

New Update
nithish-kumar

బీహార్ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  బీహార్‌ ఓటర్ల జాబితాలో స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) కు వ్యతిరేకంగా తేజస్వియాదవ్‌ మాట్లాడగా.. దానికి  ఎస్‌ఐఆర్‌ను సమర్థిస్తూ సీఎం నితీశ్‌ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యద్ధం నడించింది.  ఓ సందర్భంలో నితీశ్‌ కుమార్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నువ్వొక బచ్చాగాడివి, నీకేం తెలుసు..?’ అని తేజస్విపై మండిపడ్డారు.

నువ్వు ఏం మాట్లాడుతున్నావు?

తేజస్వి ఆరోపణలతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తన తల్లిదండ్రుల పదవీకాలాన్ని గుర్తు చేస్తూ, "నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చిన్నప్పుడు, నీ తల్లిదండ్రులు ముఖ్యమంత్రులుగా ఉండేవారు. అప్పటి పరిస్థితి నీకు తెలుసా? అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో నీకు తెలుసా..? నువ్వు మంచి పని చేయకపోవడంతో నిన్ను (మహాఘట్బంధన్) వదిలేశాం. ఈ ఏడాది ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలు ఏం చేయాలో ఆలోచిస్తారు. మా ప్రభుత్వం చాలా పని చేసింది. ఇలాంటి వ్యక్తులు (తేజస్వియాదవ్‌ను ఉద్దేశించి) ఎన్నికల కోసం ఏదైనా చెబుతారు. ఇంతకు ముందు మహిళలు ఎప్పుడైనా ఏదైనా పొందారా? మనం మహిళల కోసం చాలా చేశాం. ఆర్జేడీ ముస్లింల కోసం ఏమీ చేయలేదు. మనం ముస్లింల కోసం పనిచేశాం. నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు ఏమి తెలుసు? పాట్నాలో సాయంత్రం వేళల్లో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు కూడా అడుగు పెట్టేవారు కాదు. మనం చేసిన పనితో ప్రజల వద్దకు వెళ్తాము." అని నితీష్ కుమార్ అన్నారు.  

అంతకుముందు తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ ఓటర్‌ జాబితాలో పేరు నమోదు కోసం 11 రకాల డాక్యుమెంట్‌లు అడుగుతున్నారు. పేదలు, నిరక్షరాష్యులకు ఆ 11 రకాల డాక్యుమెంట్లను కేవలం 25 రోజుల్లో సిద్ధం చేసుకోవడం సాధ్యమా..? ఇది పేదలకు, నిరక్షరాష్యులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థికభారంగా మారింది. ఎన్నికల సంఘం తీరుతో పేదలు ఎన్నికలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఓటు అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఆ హక్కును ఈసీ పేదలకు దూరం చేస్తోంది అని విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు