Cinema: కోలీవుడ్ హీరో సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో! 'పరాశక్తి' క్రేజీ అప్డేట్

శివ కార్తికేయన్ 'పరాశక్తి' సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్ నుంచి లీకైన ఓ వీడియోలో రానా స్టైలిష్ లుక్ కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

New Update
Parasakthi Movie

Parasakthi Movie

గతేడాది 'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తన తదుపరి ప్రాజెక్ట్ ను సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్నారు.  'పరాశక్తి' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్ నుంచి లీకైన ఓ వీడియోలో రానా స్టైలిష్ లుక్ కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. గతంలో రజినీకాంత్  'వెట్టయాన్' సినిమాలో విలన్ పాత్రలో కనిపించి మెప్పించిన రానా.. ఇప్పుడు 'పరాశక్తి' తో మరోసారి కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో రానా పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.    

Also Read : అంతా ఫేక్.. సోనూ సూద్ నుంచి ఒక్క రూపాయి రాలేదు - ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్

Also Read :  హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. ఈ ఏరియాల్లో కుమ్ముడే కుమ్ముడు

ఒక పీరియడ్ డ్రామా

'పరాశక్తి' సినిమా 1960ల నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీలీల ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా..  రవి మోహన్, అథర్వా, గురు సోమసుందరం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతున్నట్లు సమాచారం. మునుపటి షెడ్యూల్స్  చెన్నై, చిదంబరం, కారైకుడి, మధురై, కొలంబో వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. 

Also Read: Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!

Also Read :  వాచిపోయే బడ్జెట్తో వీరమల్లు మేకింగ్.. ఎంతొస్తే సేఫ్!

sivakarthikeyan parashakthi movie | cinema-news

Advertisment
తాజా కథనాలు