/rtv/media/media_files/2025/02/20/SmaBiOHxVJ3tAfMyKvwW.jpg)
tollywood actor nani and Sailesh Kolanu hit 3 movie teaser release date announced
నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది ‘సరిపోదా శనివారం’ సినిమాతో వచ్చి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పార్టులకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్ నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ తెరకెక్కింది. అందులో అడవి శేష్ హీరోగా నటించాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద భారీ రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేసింది. కలెక్షన్ల పరంగా కూడా అద్బుతమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా నేచురల్ స్టార్ నాని హిట్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఇందులో నాని భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
టీజర్ రిలీజ్ డేట్
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మూవీ యూనిట్ అదిరిపోయే అప్టేడ్ అందించింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. నాని బర్త్ డే సందర్భంగా ఈ నెల 24న హిట్ 3 టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నాని ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. హిట్ 3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపాడు.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
Sarkaar.
— Nani (@NameisNani) February 20, 2025
24-02-2025.
🚨#HIT3Teaser pic.twitter.com/5iprewz8Qy
ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ గాసిప్ వినిపిస్తోంది. ఇందులో రెండు కీలక గెస్ట్ రోల్స్ ఉన్నాయని తెలుస్తోంది. మునుపటి సిరీస్‌లో హీరోలైన విశ్వక్ సేన్, అడవి శేష్.. ఇప్పుడు హిట్ 3లో కనిపిస్తారని ఓ వార్త గట్టిగా వినిపిస్తోంది.