నవంబర్ 2022లో భారత్ జోడో యాత్రలో వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ బ్రిటీష్ సేవకుడు అని అన్నారు. దీనిపై కేసు నమోదయింది. కాంగ్రెస్ ఎంపీ తన వ్యాఖ్యల ద్వారా సమాజంలో ద్వేషాన్ని, దుష్ప్రవర్తనను వ్యాప్తి చేశారని న్యాయవాది నృపేంద్ర పాండే ఫిర్యాదు చేశారు దీని తరువాత రాహుల్ మీద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A (గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 505 (ప్రజా విధ్వంసం కలిగించే ప్రకటనలు చేయడం)వంటి అభియోగాల కింద కేసును నమోదు చేశారు. ఇప్పుడు ఇదే కేసు విషయంగా లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. జనవరి 10, 2025న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
Also Read: Rahul: నా మొదటి ప్రసంగం కంటే బాగుంది..ప్రియాంక స్పీచ్‌పై రాహుల్ స్పందన