CM Chandra babu: అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్

అల్లు అర్జున్ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ఫోన్ చేశారు. అరెస్ట్‌ పై ఆందోళన చెందవద్దని సూచించారు. 

New Update
11

అల్లు అర్జున్ అరెస్ట్‌పై అందరూ స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. బన్నీ తండ్రి అయిన అల్లు అరవింద్‌కు కాల్ చేసి చంద్రబాబు పరామర్శించారు. అరెస్ట్‌పై ఆందోళన చెందవద్దని సూచించారు. ఏమీ కాదని, త్వరగానే తిరిగి వచ్చేస్తాడని భరోసా ఇచ్చారు. 

మరోవైపు అల్లు అర్జున్ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. అల్లు అర్జున్ ఈరోజు చంచల్‌గూడ జైల్లోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఇంకా చేరలేదని సమాచారం. అధికారికంగా బెయిల్ ఉత్తర్వులు తమకు అందలేదని జైలు అధికారులు అంటున్నారు. బెయిల్ ఉత్తర్వు కాపీలు ఇంకా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదని జైలు అధికారులు చెబుతున్నారు. 

Also Read: KTR: ఇది కచ్చితంగా అభద్రతా భావమే..బన్నీ అరెస్ట్‌పై కేటీఆర్

Advertisment
తాజా కథనాలు