ఇవాళ సినిమా పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. పలు విషయాలపై చర్చించనున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్‌తో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు వస్తారని సమాచారం అందింది. అలాగే ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నట్లు తెలిసింది.
ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరు డుమ్మ కొడుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు కారణాల వల్ల చిరు ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌తో భేటీ కాబోయే హీరోలు, దర్శకులు, నిర్మాతల లిస్ట్ వచ్చేసింది.
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?
సీఎం రేవంత్‌ను కలవబోయేది వీళ్లే!
రేవంత్ రెడ్డిని కలవబోయే సినీ ప్రముఖులలో హీరోల విషయానికొస్తే.. నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ కలవనున్నారు. అదే సమయంలో డైరెక్టర్స్ విషయానికొస్తే.. త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట కలవనున్నారు. ఇక ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ కలవనున్నారు.
ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!
అయితే ఈ మీటింగ్ కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బెనిఫిట్‌షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండబోవన్న అసెంబ్లీ ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? అనే చర్చ సాగుతోంది. సీఎంను సినీ ప్రముఖులు ఎలా ఒప్పిస్తారన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు త్రివిక్రమ్, రాఘవేంద్ర రావు, హరీష్ శంకర్, దిల్ రాజు, అల్లు అరవింద్, శ్యాంప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి చేరకున్నారు.
ALSO READ: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి!