Baaghi 4 OTT: టైగర్ ష్రాఫ్ "బాఘీ 4" ఓటీటీ రిలీజ్‌కి రెడీ..! వివరాలు ఇవే!

టైగర్ ష్రాఫ్ నటించిన 'బాఘీ 4' సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 17, 2025న రెంటల్ బేసిస్‌పై స్ట్రీమింగ్ కానుంది. దీనిపై ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

New Update
Baaghi 4 OTT

Baaghi 4 OTT

Baaghi 4 OTT: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) ప్రధాన పాత్రలో నటించిన "బాఘీ 4" ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటిటి బాట పడుతోంది. ఈ సారి సినిమాకు దర్శకత్వం వహించినది ఎ. హర్షా, అలాగే హీరోయిన్‌గా సోనం బాజ్వా నటించగా, మాజీ మిస్ యూనివర్స్ హర్ణాజ్ సందూ, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు..

ఈ సినిమాపై ఫస్ట్ నుండి మంచి అంచనాలు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. యాక్షన్ సినిమాలకు ముందుండే టైగర్ ష్రాఫ్‌కు ఇది కొంత నిరాశే. కానీ ఇప్పుడు ఓటిటిలో ఈ సినిమా బాగానే రన్ అవుతుందన్న నమ్మకంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

Prime Videoలో అక్టోబర్ 17న స్ట్రీమింగ్?

తాజా సమాచారం ప్రకారం, "బాఘీ 4" సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 17, 2025 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు టాక్. అయితే ఇది రెంటల్ బేసిస్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే కొంత మొత్తం చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ విషయంపై ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సాజిద్ నాడియాడ్‌వాలా తన నాడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. హై ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, భావోద్వేగాలకు కూడా చోటిచ్చే కథతో ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో పూర్తిగా ఆకట్టుకోలేకపోయినా, ఓటిటిలో మాత్రం మంచి రిజల్ట్ రాబడుతుందేమో చూడాలి.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

బాఘీ 4ను అక్టోబర్ 17న ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. టైగర్ ష్రాఫ్ అభిమానులు మాత్రం ఈసారి ఓటిటిలో ఆ సినిమాను ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు