/rtv/media/media_files/2025/01/09/UB2mFejeBRhhGODhx66H.jpg)
Putrada Ekadashi 2025
Tholi Ekadashi 2025: హిందూ మతంలో తొలి ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆయాశాడా మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనినే దేవశయనీ ఏకాదశి, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి తెలుగు పండగలు తీసుకొస్తుందని శాస్త్రం! అంటే ఇక్కడ నుంచి వరుసగా పండగలు రావడం మొదలవుతుంది. ఈ ఏడాది జులై 6 ఆదివారం రోజున తొలిఏకాదశి వచ్చింది. ఈరోజున విష్ణు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదంగా పరిగణిస్తారు.
అయితే ఈ ప్రతేకమైన రోజు ఉపవాసం ఉన్నవారు ఏకాదశి వ్రత కథను పఠించాలి. వ్రత కథను పఠించడం ద్వారా, విష్ణువు దయతో అన్ని కోరికలు నెరవేరుతాయని, మరణం తర్వాత మోక్షం పొందుతారని, అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.
Also Read : Earthquake: ఇండోనేషియాలో వరుస భూకంపాలు.. వణికిపోతున్న ప్రజలు
ఏకాదశి వ్రత కథ
పురాతన కాలంలో, సూర్యవంశంలో మాంధాత అనే మహారాజు ఉండేవాడు. ఆయన చాలా నీతిగా, ధర్మబద్ధంగా పాలించేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా, సుఖంగా జీవించేవారు. ఎక్కడా పేదరికం లేదు, ప్రజలకు ఎలాంటి బాధలూ లేవు. అయితే, ఒకసారి మాంధాత రాజ్యంలో చాలా సంవత్సరాల పాటు భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు పడలేదు, నదులు ఎండిపోయాయి. భూమి నెర్రెలు పారింది. పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటించారు. దీంతో రాజు ప్రజల బాధను చూసి చాలా దుఃఖించాడు.
ఈ కరువుకు కారణం ఏంటి? దీన్ని ఎలా పోగొట్టాలి?" అనే ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మాంధాత మహారాజు రాజ్యాన్ని విడిచిపెట్టి పరిష్కారం వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడ ఆయనకు అంగీరసుడు మహర్షీ కలుస్తాడు. అంగీరసుడు గొప్ప తపశ్శాలి, మూడు లోకాల గురించి తెలిసినవాడు.
Also Read : టాయిలెట్‌లో ఉండి వర్చువల్ విచారణ.. కోర్టు కీలక ఆదేశం
మాంధాత మహారాజు అంగీరస మహర్షి పాదాలకు నమస్కరించి, తన బాధను, తన ప్రజల కష్టాలను వివరించాడు. "మహర్షీ! మా రాజ్యంలో చాలా సంవత్సరాలుగా వర్షాలు లేవు. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ఈ కరువును పోగొట్టే మార్గం దయచేసి చెప్పండి" అని వేడుకున్నాడు.
అప్పుడు అంగీరస మహర్షి.. ఈ కరువుకు కారణం నువ్వు చేసిన ఏ తప్పూ కాదు. కానీ, ఈ భూమిపై కొంతమంది ధర్మాన్ని సరిగ్గా పాటించడం లేదు. అందుకే ఇలాంటి విపత్తు వచ్చింది. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. అదే తొలి ఏకాదశి వ్రతం! ఈ వ్రతాన్ని శ్రద్ధగా పాటిస్తే, శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో కరువు పోతుంది, వర్షాలు కురుస్తాయి అని చెప్పాడు.
మహర్షి అంగీర సూచనలను మేరకు మాంధాత తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. అతను ప్రజలందరితో కలిసి ఏకాదశి ఉపవాసం ఆచరించాడు. ప్రజలు కూడా తమ కష్టాలు తీరతాయని ఆశతో, శ్రద్ధగా శయని ఏకాదశి (తొలి ఏకాదశి) వ్రతాన్ని ఆచరించారు. ఆ తర్వాత రాజ్యంలో కుండపోత వర్షం కురిసింది. ప్రజలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. మాంధాత మహారాజుకు జయజయధ్వానాలు పలికారు. అప్పటి నుండి, ప్రజలు శయని ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావించి, ప్రతి సంవత్సరం ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించడం మొదలుపెట్టారు. ఈ ఉపవాసం పాటించడం ద్వారా భక్తుడి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
Also Read: Pawan Kalyan - Mahesh Babu: పవన్, మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే థియేటర్‌లో రెండు ట్రీట్‌లు!
Also Read : ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య!.. చెట్టుకు వేలాడుతూ
Latest News