Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించనున్న సినిమాలివే!

ఈ వారం థియేటర్, ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి 14వ తేదీన కోర్టు, దిల్ రుబా, ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ, ది డిప్లొమాట్‌ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అమెరికన్‌ మ్యాన్‌ హంట్‌, పరాక్రమం, రామం రాఘవం ఓటీటీలో విడుదల అవుతాయి.

New Update

ప్రతీ వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరిస్తుంటాయి. మరి ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో చూద్దాం. 

కోర్టు
నాని నిర్మాతగా, రామ్‌ జగదీశ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్‌ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

దిల్ రూబా
కిరణ్‌ అబ్బవరం, దర్శకుడు విశ్వకరుణ్‌ కాంబోలో వస్తున్న సినిమా దిల్‌ రూబా. ఈ సినిమాలో రుక్సర్‌ థిల్లాన్‌ కిరణ్ సరసన నటిస్తోంది. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సిన ఈ మూవీ మార్చి 14న రిలీజ్ కానుంది. 

ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ
కున్‌చకో బొబన్‌, ప్రియమణి, జగదీశ్‌, విశాక్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ’. మార్చి 7 విడుదల కావాల్సిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

ది డిప్లొమాట్‌
జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో శివమ్‌ నాయర్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ఫిల్మ్‌  ది డిప్లొమాట్‌. మార్చి 14న రిలీజ్ కానుంది.

యుగానికి ఒక్కడు
కార్తి హీరోగా నటించిన యుగానికి ఒక్కడు మూవీ మార్చి 14వ తేదీన రీ రిలీజ్ కానుంది. 2010లో విడుదలైన ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!

ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌
అమెరికన్‌ మ్యాన్‌ హంట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)- మార్చి 10
అమెజాన్‌ ప్రైమ్‌
వీల్‌ ఆఫ్‌ టైమ్‌ 3 వెబ్‌సిరీస్‌ - మార్చి 13
బీ హ్యాపీ (హిందీ) - మార్చి 14
జీ5
ఇన్‌ గలియోంమే (హిందీ)- మార్చి 14
ఆపిల్‌ టీవీ ప్లస్‌
డోప్‌థీప్‌ (వెబ్‌సిరీస్‌) - మార్చి 14
ఈటీవీ విన్‌
పరాక్రమం (తెలుగు) - మార్చి 13
రామం రాఘవం  (తెలుగు) - మార్చి 14

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు