/rtv/media/media_files/2025/11/24/raja-saab-2025-11-24-12-43-52.jpg)
Raja Saab
Raja Saab: ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా దర్శకుడు మారుతికి(Director Maruthi) ఈ చిత్రం చాలా కీలకం. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు, ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమాపై పెద్ద అంచనాలు పెట్టుకున్నారు.
ఇటీవల విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే పాట రిలీజ్ వేడుక సందర్భంగా మారుతి మాట్లాడిన కొన్ని మాటలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అసహనానికి గురిచేసాయి. సోషల్ మీడియాలో కొంత నెగటివ్ ట్రెండ్ కూడా మొదలైంది. దీనిపై మారుతి వెంటనే క్షమాపణ చెప్పారు. వివాదం పెద్దదిగా మారుతుందని గుర్తించిన దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో స్పందించారు.
Also Read: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!
Maruthi Apology to NTR Fans
#Maruthi Said - COLLAR LIFTING WORDS ARE VERY SMALL - For the CUTOUT Prabhas , Banger RebelSaab Arriving From #TheRajaSaab Film.
— GetsCinema (@GetsCinema) November 23, 2025
pic.twitter.com/xlIO8XE6QB
“ముందుగా ప్రతి అభిమానికి హృదయపూర్వక క్షమాపణలు. నేను ఎవరి మనసును నొప్పించాలని అసలు అనుకోలేదు. కొన్నిసార్లు మాట్లాడుతుంటే భావం ఒకలా, మాటలు మరోలా వచ్చేస్తాయి. నా మాటలు తప్పుగా అర్థం అయ్యాయి, దానికి నిజంగా చింతిస్తున్నాను.”
Also Read: ఇది కదా మాకు కావాల్సింది..! మాస్ డాన్స్‌తో దుమ్ముదులిపిన ‘రెబల్ సాబ్’
తనకు జూనియర్ ఎన్టీఆర్‌పై ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేసారు. “నాకు ఎన్టీఆర్ గారిపై, ఆయన అభిమానులపై అపారమైన గౌరవం ఉంది. మీరు మీ హీరోను ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. నా మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటో నిజాయితీగా చెబుతున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి.”
/rtv/media/post_attachments/f2fa3955-312.png)
Also Read: బిగ్‌బాస్ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే
వివాదం ఎలా మొదలైంది?
పాట విడుదల ఈవెంట్‌లో ప్రభాస్ కట్‌ఔట్ ఆవిష్కరణ జరిగింది. ఆ సమయంలో మారుతి మాట్లాడుతూ.. “సినిమా రిలీజ్ అయ్యాక మీరు కాలర్లను లేపడం లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు, మీరు చూసేది దానికి మించిన అనుభవం.” అని చెప్పారు.
ఈ మాటలను కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన సిగ్నేచర్ ‘కాలర్ లిఫ్టింగ్’ జేశ్చర్‌ని పరోక్షంగా టార్గెట్ చేసినట్టు భావించారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఒక ఫ్యాన్ ఇలా రాశాడు: “కట్‌ఔట్‌ను మాత్రమే పొగడాల్సింది, అవసరంలేని పోలిక ఎందుకు తీసుకొచ్చారు?” అని కామెంట్ చేయగా.. ఈ వ్యాఖ్యకు మారుతి వెంటనే క్షమాపణ చెప్తూ స్పందించారు.
Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
మారుతి వివరణ ఇచ్చిన తర్వాత పరిస్థితి కొంత శాంతించింది. ఇప్పుడు టీమ్ మళ్లీ సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టాలని కోరుకుంటోంది. ‘ది రాజా సాబ్’ మొదటి పాట విడుదల వేడుకలో ప్రభాస్ భారీ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. అక్కడ అభిమానుల స్పందన అద్భుతంగా ఉండటంతో టీమ్ మొత్తం చాలా ఆనందించింది.
‘ది రాజా సాబ్’లో హీరో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో టీ.జీ. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
టెక్నికల్ టీమ్:
సినిమాటోగ్రఫీ: కార్తిక్ పలాని
ప్రొడక్షన్ డిజైన్: రజీవన్
ఎడిటింగ్: కొట్టగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: తమన్ ఎస్ ఎస్
ఇది హారర్- కామెడీ జానర్‌లో రూపొందుతున్న ప్రత్యేకమైన సినిమా. ‘ది రాజా సాబ్’ను 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాలో భారీ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్, ఫెయిరీటేల్ స్టైల్ కథ ఉంటుందని ఆశిస్తున్నారు.
Follow Us