Thammudu Twitter Review: 'తమ్ముడు' ట్విట్టర్‌ రివ్యూ.. తమ్ముడితో నితిన్ హిట్ కొట్టాడా?

తమ్ముడు మూవీలో నితిన్ యాక్టింగ్ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ఫస్టాప్ కాస్త ల్యాగ్ అనిపిస్తుందని, సెకండాఫ్ బాగుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ బాగుందని, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని ట్వీట్స్ చేస్తున్నారు. 

New Update

డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నితిన్ కాంబోలో నేడు తమ్ముడు మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సినిమాపై కాస్త పాజిటివ్, నెగిటివ్ టాక్ కూడా నడుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మించిన ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

సెకండాఫ్ కాస్త బాగుందని..

తమ్ముడు మూవీలో నితిన్ యాక్టింగ్ అదిరిపోయిందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో ఫస్టాప్ కాస్త ల్యాగ్ అనిపిస్తుందని, సెకండాఫ్ బాగుందని నెటిజన్లు అంటున్నారు. అయితే సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. బీజీఎం బానే ఉందని, వీఎఫ్‌ఎక్స్ కూడా అదిరిందని అంటున్నారు. సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని, పాటలు అంతగా బాలేవని, కొన్ని సీన్లలో ఎమోషనల్ లేదని ట్వీట్స్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

పాత చింతకాయ పచ్చడిని డైరెక్టర్ కొత్తగా తీయాలని ప్రయత్నించాడు. కానీ అది కూడా సరిగ్గా స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని అంటున్నారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ లేవని, సినిమా మొత్తం బోర్‌గా ఉందని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

Advertisment
Advertisment
తాజా కథనాలు