HBD Thalapathy Vijay: తమిళ స్టార్ విజయ్ తలపతి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాబోయే సినిమా 'జన నాయగన్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 'ది ఫస్ట్ రోర్' పేరుతి చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "నిజమైన నాయకుడు అధికారం కోసం కాదు, ప్రజల కోసం వస్తాడు" అనే శక్తివంతమైన డైలాగ్‌తో విజయ్ ఇంట్రో అదిరిపోయింది.
Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
INSANE 🔥🔥 #JanaNayaganpic.twitter.com/soTk9zciWe
— Jana Nayagan (@JanaNayaganVJ) June 21, 2025
బీజీఎమ్ హైలైట్
విజయ్ మాస్ అవతార్, స్టైలిష్ లుక్ హైలైట్ గా కనిపించాయి. అలాగే కత్తితో మీసం సరిచేసుకునే షాట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం విజయ్ పాత్రను మరింత హైలైట్ చేసింది. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చేస్తున్న చివరి సినిమా 'జన నాయగన్ ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Kuberaa Success: 'కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్
సంక్రాంతి కానుకగా
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్ , ప్రియమణి, మమితా బైజు, ప్రకాష్ రాజ్ వంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. వెంకట నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జన నాయగన్ ' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. రాజకీయాలకు ముందు చివరి సినిమా కావడంతో, ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.