Kuberaa Success: 'కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్

'కుబేరా' బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. దీంతో చిత్రబృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, నాగార్జున, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీమ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.

New Update

Kuberaa Success: shekar శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రష్మిక మందన్నా, నాగార్జున, ధనుష్, ప్రధాన పాత్రలో నటించిన  'కుబేరా' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. తొలిరోజు ఊహించిన దానికంటే ఎక్కువ ఆక్యుపెన్సీ సాధించింది. దీంతో చిత్రబృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, నాగార్జున, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీమ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. 

నిజాయితీగా తీశాను 

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ మాట్లాడుతూ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై సంతోషం వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకు తీసిన సినిమాల్లో  అత్యంత నిజాయితీగా, అద్భుతంగా తీసిన   'కుబేరా' అని పేర్కొన్నారు. ధనుష్ నటన చాలా అద్భుతంగా చిత్రీకరించబడిందని..  ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవుతున్నారని తెలిపారు. అలాగే  నాగార్జున  పాత్ర ప్రేక్షకులలో తీవ్రమైన భావోద్వేగ ప్రభావాన్ని చూపిందని ఆనందం వ్యక్తం చేశారు.

అలాగే సినిమా నిడివి పై వస్తున్న విమర్శలపై కూడా స్పందించారు శేఖర్ కమ్ముల. ''కథలోని ప్రతి భాగాన్ని నిజాయితీగా చెప్పడానికి మేము ప్రయత్నించాము, ఆయా సన్నివేశాలు ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు  ఆవిధంగా రూపొందించడమే ధర్మం అని తెలిపారు. హీరో నాగార్జున కూడా 'కుబేరా'కు వస్తున్న ప్రశంసలపై తన సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే నిర్మాత  సునీల్‌ ధన్యవాదాలు తెలిపారు.  శేఖర్ కమ్ములతో  పనిచేయాలని ఎప్పుడూ  కోరుకునేవాడినని అన్నారు. 

Also Read: Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని..  తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల

Advertisment
Advertisment
తాజా కథనాలు