/rtv/media/media_files/2025/06/16/8n7dZaHSrierKjPg6H5C.jpg)
Kushal Tandon confirms breakup with Shivangi Joshi
Kushal Tandon: సినీ ఇండస్ట్రీలో మరో జంట తమ బంధానికి ముగింపు పలికింది. బాలీవుడ్ టెలివిజన్ తారలు ఖుషాల్ టండన్, శివాంగి జోషి బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఖుషాల్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఐదు నెలల క్రితమే తాము విడిపోయినట్లు పోస్టులో పేర్కొన్నాడు. శివాంగి జోషి కొత్త సీరియల్ షో 'బడే అచ్చే లగ్తే హై 4' ప్రసారానికి ముందే ఖుషాల్ ఈ వార్తను బయటపెట్టడం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
/rtv/media/media_files/2025/06/16/PtV6e398ukuGnkLHQFp2.png)
Also Read:Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!
ఖుషాల్ పోస్ట్
ఖుషాల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చాడు.. నా ప్రియమైన వారందరికీ.. ఇకపై నేను, శివాంగి కలిసి లేమని చెప్పాలనుకుంటున్నాను. మేము విడిపోయి ఐదు నెలలైంది అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఖుషాల్ వెంటనే తొలగించినప్పటికీ.. వారు విడిపోయారనే వార్త అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/06/16/Y8Uij7qHTNpNsw3m8Dz1.png)
ఆ సమయంలోనే ప్రేమ
అయితే కుషాల్, శివాంగి 'బర్సాతిన్ మౌసమ్ ప్యార్ కా' సీరియల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. ఇప్పుడు సడెన్ గా బ్రేకప్ చెప్పుకున్నట్లు ప్రకటించారు. ఇటీవలే మార్చి లో కూడా శివాంగి కుషాల్ బర్త్ డే సందర్భంగా అతడి కోసం ఒక సుదీర్ఘ నోట్ షేర్ చేసింది. జీవితంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ ప్రేమతో రాసింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి జోడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్ కి షాకిచ్చింది.
Dhanush: ధనుష్ డైరెక్షన్ లో పవన్.కళ్యాణ్ ... 'కుబేరా' హీరో కామెంట్స్ వైరల్!