/rtv/media/media_files/2025/12/04/akhanda-2-bookings-2025-12-04-15-58-24.jpg)
Akhanda 2 Bookings
Akhanda 2 Bookings: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2’ విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చింది. దీంతో బుకింగ్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
Also Read: మెగాస్టార్ ‘ఎంఎస్‌జీ’ క్రేజీ అప్‌డేట్.. ‘శశిరేఖ’ వచ్చేస్తోంది..!
/rtv/media/post_attachments/8200677d-889.png)
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజుల పాటు హైక్ ఇచ్చినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం మూడు రోజులు మాత్రమే టికెట్ రేట్లు పెంపుకు అనుమతించింది. ప్రీమియర్ షోలు ఒక్కో టికెట్ ధరను ₹600గా నిర్ణయించారు.
Also Read: 'అఖండ 2' నైజాం బుకింగ్స్ టెన్షన్..! ఎందుకింత ఆలస్యం..?
సాధారణ షోల కోసం..
- సింగిల్ స్క్రీన్స్: ₹50 పెరుగుదల (GST సహా)
- మల్టీప్లెక్స్లు: ₹100 పెరుగుదల (GST సహా)
ఈ మార్పుతో కొత్త టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి:
- మల్టీప్లెక్స్: ₹395
- సింగిల్ స్క్రీన్: ₹227
వీకెండ్ వరకు మాత్రమే టికెట్ హైక్ ఉండటం మంచి వార్తగా చెప్పాలి. మొదటి వర్కింగ్ డే నుండి రేట్లు మామూలు ధరలకు తిరిగి వస్తాయి. దీంతో ఎక్కువ మంది ప్రేక్షకులు పెద్దగా ఖర్చు లేకుండానే సినిమా చూడగలరు.
Also Read: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రికార్డ్ రన్‌టైమ్..? మేకర్స్ క్లారిటీ..!
అఖండ 2 నటీనటులు & టెక్నికల్ టీమ్
ఈ సారి కథలో ముఖ్యమైన పాత్రలో సమ్యుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అలాగే కబీర్ దుహాన్ సింగ్, పూర్ణ, హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
సినిమాను 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. సంగీతాన్ని తమన్ అందించగా, ఈసారి చిత్రం 3Dతో పాటు పలు ఫార్మాట్లలో విడుదల కావడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Also Read: అల్లు అర్జున్ తలుపు తట్టిన మరో స్టార్ డైరెక్టర్..! సూపర్-హీరో ప్రాజెక్ట్..?
తెలంగాణ టికెట్ హైక్ పరిమిత రోజులు మాత్రమే ఉండటం, వారాంతం తర్వాత ధరలు తగ్గిపోవడం ప్రేక్షకులకు నిజంగా మంచి వార్తనే చెప్పాలి. మరోవైపు ‘అఖండ 2’పై భారీ అంచనాలు ఉండటంతో ఇంకా ఎక్కువ మంది థియేటర్లకు రావొచ్చు. మొత్తానికి, బాలయ్య - బోయపాటి కాంబినేషన్ మళ్లీ ఎలా సందడి చేస్తుందో చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Follow Us