/rtv/media/media_files/2025/05/29/4T4yc3LXatYagS5O2v3c.jpg)
Gaddar awards: best actor Allu arjun
Gaddar Film Awards Telangana: తెలంగాణ గద్దర్ అవార్డులను జ్యురీ కమిటీ చైర్ పర్సన్ జయసుధ(jayasudha) ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా.. వాటిని పరిశీలించి అవార్డు విజేతలను ప్రకటించారు. అయితే అవార్డుల ప్రదానం జూన్ 14న చేయనున్నట్లు తెలిపారు. 14 ఏళ్ళ తర్వాత తెలంగాణలో మళ్ళీ సినిమా అవార్డులను ప్రకటించారు. 2014-2023 వరకు సంవత్సరానికి ఒక సినిమాను, అలాగే సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఇక 2024 కి సంబంధించి అన్ని కేటగిరీల్లో అవార్డు ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు ఇలా పలు కేటగిరీల్లో 21 మందికి స్పెషల్ జ్యురీ అవార్డులు ప్రకటించారు.
అవార్డు విజేతలు
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్- కల్కి
- బెస్ట్ రెండవ ఫీచర్ ఫిల్మ్స్ - పొట్టేలు
- బెస్ట్ మూడవ ఫిల్మ్ - లక్కీ భాస్కర్
ఉత్తమ నటీనటులు
- బెస్ట్ హీరో- అల్లు అర్జున్ (పుష్ప-2)
- బెస్ట్ డైరెక్టర్- నాగ్ అశ్విన్ (కల్కి)
- బెస్ట్ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లురీ ( లక్కీ భాస్కర్)
- బెస్ట్ కమెడియన్ - సత్య, వెన్నెల కిషోర్ (మత్తువదలరా 2)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - ఎస్. జె సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
- బెస్ట్ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య (దేవర)
- బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ - చంద్రశేఖర్ (గ్యాంగ్‌స్టర్)
- స్పెషల్ జ్యురీ అవార్డు_ దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్ )
- బెస్ట్ స్టోరీ రైటర్ _ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
- స్పెషల్ జ్యురీ అవార్డు ఫీమేల్ - అనన్య (పొట్టేలు)
- ఉత్తమ నటి- నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు)
- ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్‌రెడ్డి (గామి)
- ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
- స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్