Dil Raju Wife: దిల్ రాజు ఎవరో తెలియదు.. పెళ్లి స్టోరీ గురించి తేజస్వి షాకింగ్ కామెంట్స్!

దిల్ రాజు భార్య తేజశ్విని దిల్ రాజుతో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను దిల్ రాజును ఎలా కలిసింది? వారి వ్యవహారం పెళ్లి వరకు ఎలా వెళ్లిన అనే విషయాలను పంచుకుంది.

New Update
dil raju wife about her marriage

dil raju wife about her marriage

Dil Raju Wife: ప్రముఖ టాలీవుడ్  నిర్మాత దిల్ రాజు భార్య తేజశ్విని సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపిస్తుంటారు. తరచూ ఫ్యామిలీ, వ్యక్తిగతానికి సంబంధించిన ఫొటోలను పోస్టు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1 లక్ష ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని దిల్ రాజుతో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను దిల్ రాజును ఎలా కలిసింది? వారి వ్యవహారం పెళ్లి వరకు ఎలా వెళ్లిన అనే విషయాలను పంచుకుంది. దిల్ తన మొదటి భార్య అనిత మరణించిన తర్వాత తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

దిల్ రాజు ఎవరో తెలియదు

 తేజస్విని మాట్లాడుతూ .. ముందుగా నాకు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా ఏమీ తెలియదు. మా ఇంట్లో ఏదో ఒక్క సినిమా చూసేవాళ్ళమంతే! అది కూడా దసరా పండక్కి.  మొదట నాకు దిల్ రాజు తో పరిచయం ఏర్పడినప్పుడు.. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. డైరెక్టర్ అయ్యింటరాని అనుకున్నాను.. కానీ ఆ తర్వాత గూగుల్ చేయగా ప్రొడ్యూసర్ అని తెలిసింది. అయితే ఆ తర్వాత ఆయనకు పెళ్లయిందని తెలిసాక.. ఈ రిలేషన్ షిప్ ని ముందుకు తీసుకెళ్లొద్దని ఫిక్స్ అయ్యాను. కానీ కొంత కాలం తర్వాత మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే నిజాయితీతో ఉండే వ్యక్తి ఉంటె సరిపోతుందని భావించాను. అలా ఆయనతో మళ్లీ జర్నీ మొదలు పెట్టాను అని వివరించారు. 

Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

తేజస్వి ఇంకా మాట్లాడుతూ.. నేను పెరిగింది అంతా మా మావయ్య, పిన్ని దగ్గరే. కావున నా పెళ్లి విషయంలో తుది నిర్ణయం వారిదే అని చెప్పాను. దీంతో దిల్ రాజు ఓ సారి ఎవరిని ఒప్పించాలి అని అడిగారు. అప్పుడు మా పెద్ద మామయ్య గురించి చెప్పాను. మా పెద్ద మావయ్య మా ఫ్యామిలీలో హిట్లర్ లాంటి వారు. కానీ ఊహించని విధంగా ఆయన మా పెళ్ళికి ముందుగా అంగీకరించారు. మావయ్య ఒప్పుకున్నారు కానీ, ఇతర కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ చివరికి వారందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు. 

Also Read: Shafali Jariwala: 15 ఏళ్ల వయసులోనే ఆ వ్యాధి.. 42 ఏళ్లకు మృతి! షెఫాలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే

#telugu-news #Dil Raju
Advertisment
Advertisment
తాజా కథనాలు