Mirai OTT: ‘మిరాయ్’ స్ట్రీమింగ్ షురూ.. ఎక్కడ చూడొచ్చంటే..?

బాక్సాఫీస్‌ హిట్ ‘మిరాయ్’ సినిమా ఇప్పుడు Jio Hotstarలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్ వెర్షన్ కంటే 3 నిమిషాల తక్కువ రన్ టైమ్ తో, "వైబ్ ఉందీ బేబీ" పాట లేకుండా విడుదలైంది. హిందీ వెర్షన్ నవంబర్‌లో రానుంది.

New Update
Mirai OTT

Mirai OTT

Mirai OTT: యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సినిమా విడుదలైన దగ్గర నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.150 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని కార్తీక్ గట్టమనేని డైరెక్ట్ చేయగా, విలన్‌గా మంచు మనోజ్ తన పాత్రతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Also Read: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

ఓటిటీలోకి ఎంట్రీ

తాజాగా ఈ సినిమా Jio Cinema-Hotstar ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆడియోలతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: బాహుబలి: ది ఎపిక్ టికెట్ రేట్ల హైక్ ఉంటుందా..?

థియేట్రికల్ కట్ vs OTT కట్

ఒరిజినల్‌గా థియేటర్లలో విడుదలైన వెర్షన్ నిడివి 2 గంటల 49 నిమిషాలు ఉండగా, ఓటిటీలో కేవలం 2 గంటల 46 నిమిషాలు మాత్రమే ఉంది. అంటే, సుమారు 3 నిమిషాల ఫుటేజ్ తొలగించబడినట్టే. అయితే, ఎలాంటి సన్నివేశాలు కట్ చేశారన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు.

అంతేకాకుండా, థియేటర్లలో పాపులర్ అయిన "వైబ్ ఉందీ బేబీ" పాట ఓటిటీలో లేకపోవడం కొంతమందిని నిరాశపరుస్తోంది. ఇది పాట లైసెన్స్ సమస్యా? లేదా కట్ చేసిన భాగంలో ఉందా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

హిందీ వర్షన్ త్వరలో

ఇంకా హిందీ ఆడియెన్స్ కోసం గుడ్ న్యూస్ ‘మిరాయ్’ హిందీ వర్షన్ కూడా త్వరలోనే వచ్చేస్తుందని సమాచారం. నవంబర్‌లో స్ట్రీమింగ్‌కు రావచ్చని బజ్ ఉంది.

Also Read: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!

కాస్ట్ & టెక్నికల్ టీమ్

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. హీరోయిన్‌గా రితికా నాయక్ నటించగా, ఇతర కీలక పాత్రల్లో శ్రియ శరణ్, జగపతిబాబు, జయరామ్, గెటప్ శ్రీను కనిపించారు. సంగీతాన్ని గౌరహరి అందించారు.

ప్రేక్షకుల ఆదరణతో థియేటర్లలో హిట్ అయిన ‘మిరాయ్’, ఇప్పుడు ఓటిటీలో కూడా ఆకట్టుకుంటోంది. కానీ చిన్న మార్పులతో వచ్చినందున, ప్రేక్షకుల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి థియేటర్లలో మిస్ అయినవారికి ఈ సినిమా ఇప్పుడు ఇంట్లోనే చూసే మంచి అవకాశం లభించింది.

Advertisment
తాజా కథనాలు