Vishwak Sen Cult Movie: విశ్వక్ సేన్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో, తాజాగా తన సొంత దర్శకత్వంలో కొత్త సినిమా 'కల్ట్'ని అనౌన్స్ చేసాడు. ఈ చిత్రం ఒక మోడ్రన్ పార్టీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో గాయత్రీ భరద్వాజ్, యజ్ఞ తుర్లపాటి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
విలన్ గా తారక్ పొన్నప్ప
అయితే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది, 'పుష్ప 2' సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్ పొన్నప్ప(Tarak Ponnappa), ఈ 'కల్ట్'మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. తారక్ పొన్నప్ప జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలో కూడా నెగటివ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. దేవర, పుష్ప సినిమాలతో తారక్ పొన్నప్పకు మంచి గుర్తింపు లభించింది.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
'కల్ట్'మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్‌లో వచ్చే సోమవారం ప్రారంభం కానుంది. 'కల్ట్'ను తారక్ సినీమాస్, వన్మయి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు, 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో రవి బసూర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలోనే విడుదల కానున్నాయి.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
Follow Us