/rtv/media/media_files/2025/04/20/DdKht5grQNtVgUkEhdnx.jpg)
Pooja Hegde- Retro
Pooja Hegde- Retro: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా పేరు పొందిన పూజా హెగ్డే, గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ పరంగా కొంత వెనుకబడింది. మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా ఆడక పోవడంతో అమ్మడి కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
అయితే ఇప్పుడు, పూజా తమిళంలో నటించిన ‘రెట్రో’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా క్యారెక్టర్ అద్భుతంగా ఉండనుంది. టీజర్ చూసాక పూజ పాత్ర పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
తెలుగు సినిమాకి సైన్
ఇటీవల ‘రెట్రో' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలకు మంచి స్పందన వస్తోంది. అంతేకాక, పూజా తాజాగా ఒక తెలుగు సినిమాకి కూడా సైన్ చేసినట్టు వెల్లడించడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఏ హీరో పక్కన బుట్టబొమ్మ మెరవబోతుందని చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
'రెట్రో'లో పూజా ఓ సాంగ్ కి వేసిన స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఈ సినిమాతో అయినా పూజా తిరిగి మళ్లీ హిట్ ట్రాక్‌లో పడనుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?