Suriya- Venky Atluri గతకొద్దిరోజులుగా సూర్య- వెంకీ అట్లూరి కాంబోలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'రెట్రో' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో సూర్య. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వెంకీ అట్లూరితో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మే నుంచి దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు తెలిపారు. ఇకపై షూటింగ్ కోసం హైదరాబాద్ లో చాలా సమయం గడుపుతాను అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సూర్య. 'సూర్య46' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
"My next film will be with Sitara Entertainment directed by VenkiAtluri🎥. It will be a direct Tamil film🤞. We are starting shooting from May onwards in Hyderabad🤝. It will be a beautiful journey. We need all your love♥️♥️"
— AmuthaBharathi (@CinemaWithAB) April 26, 2025
- #Suriya at #Retro event pic.twitter.com/YHQiDwcQhp
కీర్తి హీరోయిన్ గా
అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ని ఎంపిక చేసే పరిశీలనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా పాజిటివ్ గా స్పందించారని సమాచారం. దీంతో కీర్తి ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారని టాక్. కీర్తి పాన్ ఇండియా క్రేజ్ , నటన నైపుణ్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ కి ఆమె సరైన ఎంపిక అని భావించారట చిత్రబృందం.
latest-news | cinema-news | suriya-venky atluri | Retro Pre Release
Also Read: Rajinikanth ఫ్యాన్స్ తో కలిసి సింపుల్ గా తలైవా జర్నీ.. విమానమంతా అరుపులు, కేకలు! వీడియో చూశారా