/rtv/media/media_files/2025/10/16/rajinikanth-2025-10-16-20-04-29.jpg)
Rajinikanth
Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ నుండి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇటీవల "కూలీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీ, సినిమా కంటెంట్ పరంగా అంచనాలకు చేరుకోకపోయినా, ఆయన ఇమేజ్, క్రేజ్ వలన మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్న రజినీ, ఆ సినిమాకి ముందు మరో రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట.
Also Read: ‘బాహుబలి: ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..?
సుందర్ సి - రజనీకాంత్ కాంబో..
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, మాస్ మసాలా ఎంటర్టైనర్స్‌కి పేరున్న దర్శకుడు సుందర్ సి(Sundar C) రజినీకాంత్‌ను కలసినట్టు టాక్ వినిపిస్తోంది. ఆయన ఒక ఇంటరెస్టింగ్ స్క్రిప్ట్ ఐడియాను రజినీకాంత్‌కు వినిపించారట. ఈ కథపై రజినీ ఎలా స్పందించారన్నది క్లారిటీ రావాల్సి ఉంది కానీ, ఇద్దరి కాంబినేషన్‌పై ఇప్పటికే చర్చలు స్టార్ట్ అయ్యాయని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!
ఇది కాకుండా, రజినీకాంత్ ఇప్పటికే వెల్స్ ఇంటర్నేషనల్, తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ బ్యానర్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!
ఇక ప్రస్తుతం రజినీ "జైలర్ 2" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 జూన్‌లో థియేటర్లలో విడుదల కానుంది. దీంతోపాటు 2025లో ఇంకొక సినిమా కూడా ప్లాన్ చేయాలని రజినీకాంత్ టీం ఆలోచనలో ఉందట. మరి వీటిలో సుందర్ సి ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందా? లేదా ఇంకెవరైనా లైన్‌లో ఉన్నారా? అన్నది వచ్చే రోజుల్లో క్లారిటీ అవుతుంది.
సాధారణంగా రజినీకాంత్ సినిమాలంటే మాస్, స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌కి పెట్టింది పేరు. అలాంటి కథనే సుందర్ సి ప్లాన్ చేశారా? లేదా ఓ వినూత్నమైన ట్రీట్‌మెంట్‌తో కొత్తగా ఆలోచిస్తున్నారా? అన్న ఆసక్తికర విషయాలపై అభిమానుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.