Samantha: రెమ్యూనరేషన్ కు లింగ భేదం ఏంటి..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా

సమంత ఇటీవల నటీనటుల పారితోషికాల్లో లింగ భేదంపై స్పందించింది. "హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యూనరేషన్ లో తేడా ఎందుకు ఉంటుంది..? సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం వెతకాలి" అని వ్యాఖ్యానించింది.

New Update
Samantha Latest Comments

Samantha Latest Comments

Samantha: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్‌ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలలో పెద్దగా మెరవకపోయినా, విభిన్నమైన పాత్రలుచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. చివరిసారిగా 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత, ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ 'రక్త బ్రహ్మాండ్' లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు 'శుభం' అనే సినిమాను సమంత నిర్మాణ బాధ్యతలతో తెరకెక్కిస్తోంది.

Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సమంత, సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్‌ల మధ్య పారితోషికంలో ఉండే అసమానతపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సమంతా మాట్లాడుతూ...

"చాలా సినిమాల్లో హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యునరేషన్‌ మాత్రం సమానంగా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో కథ ఎక్కువగా హీరో చుట్టూ తిరుగుతుంది. అటువంటి సినిమాల్లో తేడా ఉంటే నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని సినిమాల్లో కథనాయకుడు, కథానాయిక ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండటంతోపాటు స్క్రీన్‌పై సమానంగా కనిపించినా పారితోషికంలో మాత్రం తేడా ఉంటుంది. ఇది ఇప్పటికీ అన్యాయం." అంటూ స్పందించింది.

Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'

ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సమంత, ఇప్పటికైనా ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 

"ఇప్పటికిప్పుడు అన్నీ మార్చలేకపోయినా, ఏదో ఒక మార్గం వెతకాలి. నేను చేయకపోతే మరెవరు చేస్తారు? సమస్య ఎక్కడైతే ఉంది, పరిష్కారాన్ని కూడా అక్కడే వెతకాలి అనే నమ్మకం నాకు ఉంది" అని సమంత వ్యాఖ్యానించారు.

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు