Sundeep Kishan: ఆర్ నారాయణమూర్తి ట్యాగ్ పై సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్!

సందీప్ కిషన్ 'పీపుల్స్ స్టార్ ట్యాగ్' వివాదం పై స్పందించారు. ఆర్. నారాయణ మూర్తి గారికి ఆ ట్యాగ్ ఉన్నట్లు తెలియదని. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. అయితే సందీప్ తన లేటెస్ట్ మూవీ మజాకా లో 'పీపుల్స్ స్టార్' అనే ట్యాగ్ పెట్టుకున్నారు.

New Update

Sundeep Kishan: మరో మూడు రోజుల్లో సినిమా విడుదల కాబోతుండగా.. హీరో సందీప్ కిషన్ వివాదంలో చిక్కుకున్నారు. త్రినాథరావు నక్కని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన  'మజాకా'  ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. అయితే ట్రైలర్ లో సందీప్ కిషన్ పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ ను తగిలించుకోవడంపై  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దిగ్గజ దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ట్యాగ్ ను మీరెలా వాడుకుంటారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

ట్యాగ్ వివాదం పై స్పందించిన సందీప్.. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ట్యాగ్ వివాదం గురించి సందీప్ ని ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. ''ఆర్. నారాయణ మూర్తికి ఆ ట్యాగ్ ఉందని నాకు తెలియదు. నేను ట్యాగ్ ల మీద ఫోకస్ పెట్టేవాడిని కాదు. సినిమాలో నాకు ఏ ట్యాగ్ పెట్టిన తర్వాత మూర్తి గారికి ఆ ట్యాగ్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేయాలో మేము ఆలోచించాము'' అని తెలిపారు సందీప్. 

 Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!

'మజాకా'  ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య జరిగే ఫన్నీ సంభాషణలు  ట్రైలర్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగింది.  అన్షు, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆది, రఘుబాబు, అజయ్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై  రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు