Pushpa 2: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప2' మేనియా నడుస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. అంచనాలకు తగ్గట్లే అల్లు అభిమానుల మూడేళ్ళ నిరీక్షణ ఫలించింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప2 సంబరాలు కనిపిస్తున్నాయి. సినిమాలో అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్
పుష్ప2 పై RGV ట్వీట్..
తాజాగా డైరెక్టర్ RGV కూడా 'పుష్ప 2' సినిమా పై ప్రశంసలు కురిపించారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అందించినందుకు 'పుష్ప 2' టీమ్ కు అభినందనలు అని తెలిపారు. అలాగే అల్లు ఈజ్ మెగా.. మెగా.. మెగా. అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసించారు.
CONGRATS to @alluarjun and team for giving a ALL INDIA INDUSTRY HIT ..
— Ram Gopal Varma (@RGVzoomin) December 5, 2024
ALLU is MEGA MEGA MEGA MEGA MEGA
Also Read: నడుము అందాలు చూపిస్తు రాశీ హాట్ ఫోజులు.. చూస్తే మతిపోవడం ఖాయం!
పక్కా 2000 కోట్లు
రిలీజ్ కి ముందే పుష్ప2 1000 కోట్ల బిజినెస్ తో రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా అదే హవా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అల్లు అర్జున్ నటన, స్టోరీ, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని.. ఈ సారి పక్కా 2000 కోట్లు కొట్టడం అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ అద్భుతమని.. అందులో బన్నీ తన నటవిశ్వరూపం చూపించారని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 'పుష్ప2' ఏకంగా 12వేల థియేటర్లో మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది.
Also Read: ''నాన్న నువ్వే నా హీరో''.. పుష్ప2 రిలీజ్ వేళ అయాన్ స్పెషల్ లెటర్ వైరల్!